రేవంత్‌కు రూ.25 కోట్లు ఇచ్చిన రేవంత్‌? నిజమెంత?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సవాళ్ల పర్వం సాగుతోంది. కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, భాజపా నేత ఈటెల రాజేందర్‌ ఇద్దరు దొంగ నాటకాలు ఆడుతున్నారని, వారిందరు ఒక్కటే నని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి తాజాగా విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్క రూపాయి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం సాక్షిగా ప్రమాణం చేశారని...ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చాడని ఆనాడు నేను చెప్పానని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.

ఇవాళ ఈటెల రాజేందర్ వ్యాఖ్యల పై స్పందించిన రేవంత్... ఆనాడు నేను చేసిన వ్యాఖ్యల పై ఎందుకు స్పందించలేదని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి నిలదీశారు. ఈటెల రాజేందర్ ను ఉన్నది ఉన్నట్లు అడుగుతుంటే ఎందుకు అంగీ లాగు చించుకుంటున్నారన్న ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి.. వేం నరేందర్ కొడుకు పెళ్లిలో హుజురాబాద్ ఎన్నికల డీల్ కుదిరిన మాట నిజమని తెలిపారు.  25 కోట్ల డబ్బులు లెజెండ్ రెస్టారెంట్ లో డబ్బులు మార్చుకుంది నిజం కాదా అని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.

హుజురాబాద్ ఇల్లంతకుంట రాముడి గుడి సాక్షిగా ప్రమాణం చేద్దామా... టైం ఈటెల రాజేందర్ చెప్పినా సరే నన్ను చెప్పామన్నా సరేనని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి సవాల్‌ విసిరారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 25కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి ఇచ్చారని... రేవంత్ రెడ్డికి, ఈటెల రాజేందర్ కు తేడాలు రావడంతో మనసులో మాట బయటపడిందని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి అంటున్నారు.

బీజేపీ పార్టీలోని నేతల మధ్య అంతర్గత కలహాలు ఉన్నాయన్న కౌశిక్‌రెడ్డి... ఈటెల రాజేందర్ చేరికల కమిటీ చైర్మన్ కాదు..బ్రోకర్ల కమిటీ చైర్మన్ అని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. ఈటెల రాజేందర్ బీజేపీకి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేల్స్ సీఈవో లుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: