శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

శ్రీలంక చివరికి కోతులను ఇవ్వడానికే నిర్ణయించుకుంది అన్నట్టుగా తెలుస్తుంది. చైనా  దాదాపుగా తన 1000 జూలలో కోతులను పెంచడం కోసం అడుగుతుంది. కానీ ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే వాస్తవంగా వాళ్లు కోతులను పెంచుతారు. ఆ తర్వాత అవి పిల్లల్ని కన్నాక, వాటిని కోసుకుని తింటారు చైనా వాళ్ళు. ఇది ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా తెలిసి కూడా శ్రీలంక వాళ్ళు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు అంటే కోతుల సంతతిని ఎవరు కంట్రోల్ చేయలేరు.

కోతులకు ఏ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయలేరు. కాబట్టి వాటి సంతతి విపరీతంగా పెరుగుతూనే ఉంటుంది. పదేపదే డెలివరీలు అవుతూనే ఉంటాయి. వాటి వల్ల ఇప్పుడు శ్రీలంకలో సమస్య వచ్చి కూర్చుంది. అక్కడ వాటి వల్ల పంటలు బాగా దెబ్బతింటున్నాయి. ఇళ్లల్లోకి వచ్చి ప్రజలపై దాడి చేస్తున్నాయి. దాంతో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఆ కోతుల్ని పట్టుకున్నా ఎక్కడ వదిలిపెట్టి రావాలో తెలియని పరిస్థితి.

ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం ప్రజలకు ఎస్యురెన్స్ ఇచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెడితే గనుక కోతుల్ని చంపేయండి పర్వాలేదు అని చెప్పింది. మీ ఆత్మ రక్షణ కన్నా, మీ ప్రాణం కన్నా ముఖ్యం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చింది. అక్కడ ప్రజలంతా ఇంత ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో  ప్రజలు కోతుల ఎక్స్పోర్ట్ కు అడ్డుపడటం లేదు. దీంతో లక్ష కోతులను ముందుగా ఇవ్వడానికి సిద్ధపడింది శ్రీలంక.

చైనాలో కోతుల మాంసానికి మంచి డిమాండ్ ఉంటుందంట. అక్కడ మంకీ మీట్ మిగతా వాటికన్నా కాస్ట్లీ అంట. మెడిసినల్ వాల్యూ ఉంటుందని ఎక్కువ రేటు పెట్టి తింటారట. అందులోనూ ప్రత్యేకంగా మంకీ మైండ్ కి పుల్ గిరాకీ ఆట మిగతా అన్ని జంతువులు కన్నా. అందుకనే చైనా కొంటుంది. ఓవరాల్ గా శ్రీలంకలో మూడు మిలియన్ కోతులు, అంటే 30లక్షల కోతులు ఉన్నాయంట. దాంట్లో ఇప్పుడు లక్ష కోతులను అడిగిందట చైనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: