పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం బహుమతులు?

దక్షిణ కొరియా లో ఇంట్రవర్ట్స్ పెరిగిపోతున్నారు. దీంతో జనాభా సంఖ్య తగ్గిపోతుంది. ఇంట్రవర్ట్స్ అంటే ఎవరితోనూ కలవకపోవడం, కేవలం తమలో తాము మాట్లాడుకోవడం. ప్రస్తుత కాలంలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్లలో నిమగ్నమై అన్నింటిని మరిచిపోవడం. ఇలాంటి వారు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారని దీంతో దక్షిణ కొరియా జనాభా తగ్గిపోతోందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. పెళ్లిళ్లు చేసుకోవడం లేదని, ప్రేమించుకోవడం లేదని ప్రభుత్వమే డబ్బులిచ్చి వారిని ప్రేమించమని, పెళ్లిళ్లు చేసుకోమని ప్రోత్సహిస్తోంది.

ఒక్కొక్కరికి 490 డాలర్ల చొప్పున సాయం చేస్తుంది. 19 నుంచి 39 సంవత్సరాల వయసున్న ఇలాంటి వ్యక్తులను  దాదాపు 3. 50 లక్షల మందిని గుర్తించారు. వీరు దేశ జనాభా లో మూడు శాతం వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. మోస్ట్ ఏజ్ డ్ కంట్రీగా దక్షిణ కొరియా ఉంది. ఇక్కడ లో బర్త్ రేట్ కూడా  ఉంది. రాబోయే 10 నుంచి 20 ఏళ్ల లో జనం సగానికి పడిపోయే అవకాశం ఉన్నట్లు దక్షిణ కొరియా గుర్తించింది.

ఇందులో ప్రముఖంగా ఆసియా లోనే  నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న ఈ దేశంలో యువత ఉద్యోగాలు చేయడం లేదు. ఉపాధి మార్గాలు ఎంచుకోవడం లేదు. కేవలం ఇంట్రవర్ట్ లుగా మారి దేశం వెనకబాటుకు కారణమవుతున్నారని తెలుస్తోంది. యువత పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటని అడిగితే పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటే వారికి చదువు చెప్పించే స్థోమత లేదు. మరెలా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారి కోసం విద్య, వైద్యం ఉచితంగా అందించి వారిలో నైపుణ్యాలు పెంచి మిగతా జనంలో కలిపేలా చేయాలని అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

దక్షిణ కొరియాలోని యువతలో ఉన్న భయాందోళనలు పోగొట్టి తిరిగి ఎప్పటిలాగా విద్యావంతులుగా మారి, ఉద్యోగాలు పొంది పెళ్లిళ్లు చేసుకుని దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కొరియా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: