ఇజ్రాయిల్‌కు షాక్‌ ఇచ్చిన ఇండియా?

భారత దేశానికి ఇజ్రాయిల్ అత్యంత సన్నిహిత దేశం. ప్రతి ఇజ్రాయిల్ పౌరుడు తన జీవితంలో ఒకసారి భారతదేశానికి వచ్చి పోతుంటాడు. ప్రతి యూదు భారతదేశానికి రావాలనుకుంటాడు. ఒకప్పుడు క్రైస్తవులతో జరిగిన ఘర్షణలో యూదుల ప్రాణాలు ప్రపంచమంతా తీస్తూ ఉంటే పారిపోయి వచ్చినటువంటి యూదులను భారతదేశం ఒకటే ఆశ్రయించి రక్షించింది కాబట్టి, తనను రక్షించింది కాబట్టి ఆ మాత్రం గౌరవం ఉంటుంది భారతదేశంపై.

మనకు అత్యంత కీలకమైన సందర్భంలో రష్యా తన చేతిని వదిలేసిన టైం లో కూడా ఇజ్రాయిల్ ఆయుధాలను భారతదేశానికి ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాని అయిన తర్వాత ఇజ్రాయిల్ తో భారత సంబంధాలు మరింత పెరుగుపడ్డాయి. ఇంతకుముందున్న భారత దేశ ప్రధాన మంత్రులు ఇజ్రాయిల్ వెళ్ళడానికి కూడా సంశయం వ్యక్తం చేసేవారు. ఎందుకయ్యా అంటే పాలస్తీనాకు వ్యతిరేకం, ముస్లిం దేశమైనటువంటి పాలస్తీనాకి వ్యతిరేకం ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ పాలస్తీనాపై ఎప్పుడూ దాడి చేస్తూ ఉంటుంది. పాలస్తీనాలోని గాజాను కూడా ఆక్రమించుకుంది ఇజ్రాయిల్. కాబట్టి పాలస్తీనా లోని ముస్లిములు ఫీలవుతారని, భారతదేశంలోని ముస్లింలు ఫీలవుతారని నరేంద్ర మోడీకి ముందు వచ్చిన ప్రధానులు ఇజ్రాయిల్ కి వెళ్లేవారు కాదు.

అద్వానీ హోంమంత్రిగా ఉన్న సందర్భంలో హోం మంత్రి హోదాలో ఇజ్రాయిల్ కి వెళ్ళిన ప్రధమ వ్యక్తి అద్వానీ అయితే ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ కి వెళ్ళడం, ఇజ్రాయిల్ నుండి ఇజ్రాయిల్ ప్రధాని భారతదేశానికి రావడంతో బంధం మరింత బలపడింది. అలాగని మన న్యూట్రాలిటీ విధానాన్ని మనం ఏమి మార్చుకోవడం లేదు. పాలస్తీనాలో ఇజ్రాయిల్ అరాచకం చేయడానికి అంగీకరించడం లేదు, ఆక్రమించుకోవడానికి అంగీకరించడం లేదు.

అదే సందర్భంలో ఇజ్రాయిల్ ని ఒంటరిని చేయడానికి అంగీకరించడం లేదు. దానిపై దాడి చేయడానికి కూడా మనం అంగీకరించడం లేదు. తాజాగా ఐక్యరాజ్యసమితిలో భద్రత మండలి ఓటింగ్ లో ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా ఓటు వేసింది భారతదేశం. ఇలా ఇండియా ఇజ్రాయిల్ కి  షాకిచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: