జగన్‌ టైమ్‌ చూసి మోదీని కలిశారా?

రాజకీయ చదరంగంలో సరైన టైంలో సరైన ఎత్తుగడ వేస్తేనే సక్సెస్ అవుతాయి. జగన్ తెలివైన ఎత్తుగడల్లో ఒక ఎత్తుగడ ఏంటంటే మొన్న మోడీ దగ్గరికి వెళ్లినటువంటిది. కేసుల గురించి వెళ్ళాడు, అవినాష్ గురించి వెళ్ళాడు అని ఇలా ఎవరి నోటికి వచ్చినట్టు అలా ప్రచారం కూడా చేసేసారు దానిపై. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం చివరిలో, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో వెళ్లడం వెనుక ఓ కీలకమైన లెక్క ఉందని చెప్తున్నారు.

ఏదైనా డబ్బులు  గనుక ఉంటే వాటిని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా చూపిస్తారు. ఇలాంటి టైం లో మంత్రి తలుచుకుంటే లేదా ప్రభుత్వం తలుచుకుంటే రాష్ట్రానికి ఏమైనా కావాలంటే డబ్బులు పే చేసేయొచ్చు. అడ్వాన్సుగా డబ్బులు  అడ్వాన్సులుగా తీసుకుని,ఆ అడ్వాన్స్ వివరాలు తర్వాత చూసుకుంటారు. ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు గతంలో పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి.

ఎందుకు అంటే తెలుగుదేశం పనులు చేయకుండానే డబ్బులు ఇచ్చేశారు అంటూ సోషల్ ఆడిటింగ్  పెడితే  కోర్టుకు వెళ్లి వాళ్ళు డబ్బులు తెప్పించుకున్నారు. సేమ్ టైం ఆ డబ్బులు అక్కడ నుండి రికవరీ కాలేదు. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అయిపోయింది కనుక ఇచ్చేయమని అడగడం. రెండవది వచ్చేటప్పటికి పోలవరానికి ఓ 10000కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చేసేయమని అడగడం. ఈ రెండిటికీ కేంద్రం ఒప్పుకుంటుందో, లేదో? ఎందుకంటే మొన్న అమిత్ షా తో కలిశారు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి.

అమిత్ షాని ఎందుకు కలిసారంటే నిర్మలా సీతారామన్ కి చెప్పమని చెప్పడం గురించి. నిర్మలా సీతారామన్ ని కలవడం కూడా జరిగింది. వాస్తవంగా ఆ రోజు పొద్దున్నే రావాల్సిన వ్యక్తి  నిర్మల సీతారామన్ గారి అపాయింట్మెంట్ రాలేదని ఆగారు. ఆ తర్వాత మధ్యాహ్నం అయ్యే సరికి ఆవిడను కలిసి వచ్చారు. కాబట్టి జగన్ కలిసినందుకైనా ఆమె ఏమైనా స్పందిస్తుందో లేదో అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: