ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు షాక్‌ ఇచ్చిన మోదీ?

ఐఎఏస్, ఐపీఏస్ లు, ఐఆర్ ఎస్ లు, సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు ఏ ఆస్తులు  కొన్నా ప్రభుత్వానికి చెప్పాల్సిందే.  షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి తర్వాత  అవి ఎక్కువ మొత్తంలో పెరిగాయని చూపిస్తున్నారని కేంద్రం తెలుసుకుంది. ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు కొంతమంది లంచాలు తీసుకుని ఆ వచ్చిన డబ్బులను షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి తర్వాత వచ్చిన ఆదాయంలా చూపిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేసింది.

ఈ విషయాలను కేంద్రం ఈ మధ్య తెలుసుకుంది. అఖిల భారత సర్వీస్ అధికారులు చేసే స్థాక్ మార్కెట్ లావాదేవీల మీద కేంద్రం దృష్టి సారించింది. ఒక క్యాలెండర్ ఏడాదిలో షేర్లు, ఇతర పెట్టుబడుల విలువ ఒక ఏడాది మూల వేతనం కంటే ఎక్కువ ఉంటే ఆ వివరాలను సమర్పించాలని వారికి ఆదేశించింది.

కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. అఖిల భారత సర్వీసుల నిబంధనలు రూల్ 16 (4)  ప్రకారం సివిల్ సర్వీసుల అధికారులు, ఐఎఏస్, ఐపీఎస్ లు ఏటా సమర్పించే ఆదాయ వివరాలను, మళ్లీ సమర్పించాలని  ఆదేశించింది. రూల్ 14(1) అఖిల భారత సర్వీసుల్లో ఉన్న అధికారులు ఏ వ్యక్తి కూడా ఊహజనితమైన షేర్లలో పెట్టుబడులు పెట్టడం సరికాదని చెప్పింది.

షేర్లు, డివెండెట్లు ఇవన్నీ చరాస్తుల కిందకు వస్తాయని పేర్కొంది. వ్యక్తిగత లావాదేవీల విలువ రెండు నెలల మూల వేతనం కంటే ఎక్కువ ఉంటే ఆ వివరాలను రూల్ 16 (4) ప్రకారం  కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశించింది. మార్చి 20 వ తేదీన ఈ ఆదేశాలను జారీ చేసింది. ఉదాహరణకు ఒక ఐఎఏస్ అధికారికి నెలకు రెండు లక్షల జీతం ఉంటే రెండు నెలలకు నాలుగు లక్షలు వస్తుంది. అంతకంటే ఎక్కువ పెట్టుబడులు షేర్ మార్కెట్ లో పెడితే అవి ఎక్కడి నుంచి పెట్టారో కేంద్రానికి తెలపాలని ఆదేశాలను జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: