ఆ విషయంలో ఇండియాకు అమెరికా ఫుల్‌ సపోర్ట్‌ ?

గతంలో చైనా, పాకిస్థాన్ కు పూర్తి మద్దతు ఇచ్చేది అమెరికా. చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండో స్థానంలో ఉంటే పాకిస్థాన్ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అరబ్ దేశాలు సైతం చైనా చెప్పినట్లు వినే పరిస్థితి కి వస్తున్నాయి. చైనా, ఉత్తర కొరియాతో కలిసి దుందుడుకు చర్యలకు దిగుతోంది. ప్రతిసారి అమెరికా చేసే పనులకు చైనా మోకాలడ్డుతోంది. ఆసియా ప్రాంతంలో తమ ఆధిపత్యానికి చైనా గండికొడుతున్నట్లు భావిస్తున్న అమెరికా భారత్ కు దగ్గర కావాలని చూస్తోంది. గతంలో ఎన్నో విధాలుగా పాకిస్థాన్ కు అండగా అమెరికా నిలబడింది .

కానీ పాక్ చైనాకు దగ్గర అవుతుండటంతో భారత్ తో అమెరికా స్నేహ హస్తం చాటుతోంది. తవాంగ్ ఘటనకు సంబంధించి మొదటి సారి అమెరికా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో 2022 సంవత్సరం డిసెంబర్ 9 న ఘర్షణ నెలకొంది. చైనా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు సిద్దపడుతోందని భారత్ కు సమాచారాన్ని అమెరికా చేరవేసినట్లు తెలుస్తోంది. దీన్ని అధికారికంగా ధ్రువీకరించేందుకు మాత్రం అమెరికా వెనకాడుతోంది. అమెరికా చెప్పిన వెంటనే భారత బలగాలు అక్కడకు చేరుకుని చైనా తవాంగ్ సెక్టార్ ను ఆక్రమించుకోకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

చైనాతో భారత్ ఎలాగో విభేదాలు ఉన్నాయి. కాబట్టి అమెరికా మద్దతు ఇస్తుంది. ఈ ప్రాంతంలో చైనా ను నిలువరించాలంటే భారత్ తో మాత్రమే సాధ్యమవుతుందని చాలా లేట్ గా అమెరికా తెలుసుకున్నట్లు మేధావులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ చైనా సముద్రం, హిందూ మహా సముద్రంలో చైనా చేస్తున్న దుందుడుకు చర్యలను తిప్పి కొట్టాలంటే  భారత్ తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఈ విధంగానైనా భారత్ కు అమెరికా దగ్గరైతే కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: