సముద్రంలో చైనా అరాచకాలకు తాజా సాక్ష్యం?

చైనా సముద్ర జలాల్లో ఆధిపత్యం కనబరుస్తోంది. హిందూ మహా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, బ్లాక్ సీ కూడా తనదేనని అంటూ  విస్తరణ వాద కాంక్షను పెంచుకుంటూ పోతుంది. చిన్న చిన్న ద్వీపాలను కూడా తమవే అంటూ దానికి నాటికల్ మైళ్ల దూరం వరకు చైనా హద్దే అని చెబుతోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని వికృత చేష్టలకు చైనా దిగుతోంది. చైనా దక్షిణ సముద్రం పైన నుంచి వెళ్లే విమానాలను వెనక్కి వెళ్లిపోవాలని వేధిస్తోంది. వెరీ హై ప్రీక్వెనిస్ అనే దాంట్లో కి దూరిపోయి విమాన పైలెట్లను ఇబ్బందులకు గురి చేస్తోంది.

తాజాగా క్వాంటీస్ అనే ఆస్ట్రేలియా విమానాయన సంస్థ ఈ విషయాన్ని  అధికారికంగా ప్రకటించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ను చైనా జామ్ చేసిందని ఆరోపించింది. చైనా దక్షిణ సముద్రం నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తున్నాయి. చైనా యుద్ధ నౌకల స్థావరానికి మీ విమానాలు దగ్గరగా ఉన్నారని ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని కొన్ని వాయిస్ లు వినబడేలా చైనా చేస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ పెడరేషన్ పైలెట్స్ అసోసియేషన్ సంస్థ చెప్పింది. ఈ సంస్థలో 100 దేశాలకు సంబంధించిన పైలెట్లు, దాదాపు లక్ష మంది పైలెట్లు ఉంటారన్నారు. రేడియో ప్రీక్వెన్సిన్ ద్వారా వార్ షిప్ లు కొన్ని మాకు సిగ్నల్స్ ఇస్తున్నాయి.

అవతలికి వెళ్లిపోవాలని రాడార్ లను జామ్ చేస్తున్నారని తెలిపింది. గ్లోబల్ నావిగేషన్ ను కూడా చైనా జామ్ చేస్తోందని తెలిపింది. ఇంటర్నేషనల్ జీపీఎస్ సిస్టమ్ జామ్ అయిపోతే ప్రజల్ని ఎలా కాపాడగలం అంటూ పైలెట్లు వాపోతున్నారు. దక్షిణ చైనా సముద్రం, పిలిప్పీన్ ఏరియా, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లో ఈ దారుణాలకు దిగుతోందని పెడరేషన్ పైలెట్స్ అసోసియేషన్ సంస్థ తెలిపింది. రోజు రోజుకు చైనా ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. భూమి, ఆకాశం, నీటిపై ప్రపంచమంతా మాదే హక్కని చైనా వితండవాదానికి దిగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: