ఉక్రెయిన్‌ దళాలపై రష్యా భీకర దాడులు?

రష్యా, ఉక్రెయిన్ యుద్దంలో ఇన్ని రోజులు ఎంతో కష్టమైనా ఉక్రెయిన్ సైన్యం ధీరత్వంతో పోరాడింది. గతంలో రష్యా దళాల మీద ఉక్రెయిన్ దాడులు చేసి ఆ వీడియోలను అమెరికా, యూరప్ దేశాలకు పంపితే అవి ప్రపంచ వ్యాప్తంగా వైరల్ చేసేవి. ఇక రష్యా పని అయిపోయింది. యుద్ధంలో తోక ముడవాల్సిందేనని చెప్పారు. కానీ ప్రస్తుతం ఉక్రెయిన్ పరాజయం పొందుతున్నట్లు తెలిపే వీడియోలను రష్యా బయటపెడుతుంది.

బాగ్ పుత్ ప్రాంతంలో రష్యా సైన్యం, భీకరమైన దాడులకు తెగబడుతోంది. బాగ్ పుత్ లో సైన్యానికి ధైర్యం చెప్పేందుకు జెలెన్ స్కీ అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లి సైనికులకు ధైర్యం చెబుతున్న వీడియోను బయటకు రిలీజ్ చేశారు. అంతే రష్యా  ఎడ తెరపి లేకుండా తీవ్రమైన దాడులకు దిగింది. ఎంతలా బీభత్సం సృష్టించారంటే ఆఖరుకు ఉక్రెయిన్ సైనికులు బంకర్లలోకి వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యా, ఉక్రెయిన్ యుద్దంలో అత్యంత భీకరమైన దాడులు ఇవని చెప్పొచ్చు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అక్కడకు ముందే వస్తున్నాడని రష్యాకు తెలిస్తే మాత్రం అక్కడనే జెలెన్ స్కీని అంతమెందించేది. ఆయన వెళ్లిపోయిన తర్వాత అంతలా బీభత్సం సృష్టించే దాడులు చేసింది రష్యా.

బాంబులు, మిస్సైల్స్ తో బాగ్ పుత్ లో విరుచుకుపడింది. బంకర్లలో దాక్కున్న సైన్యం పై  బంకర్ బ్లాస్ట్ బాంబలను జారవిడిచి విధ్వంసమే సృష్టించింది. దీని వల్ల బంకర్ల లో ఉన్న సైనికులు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి. ఇంత జరుగుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం యుద్దం నుంచి వెనక్కి తగ్గేది లేదని చర్చలు అవసరం లేదనే చెబుతున్నారు. పుతిన్ మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నారు.

పుతిన్ పై అమెరికా, యూరప్ దేశాలు చేసిన దుష్ప్రచారాన్ని ఎవరూ ఖండించలేదు. క్యాన్సర్ బారిన పడ్డాడని, మెట్ల పై నుంచి పడ్డాడని ఇలా ఎన్నో పుకార్లు పుట్టించారు. పుతిన్ ఒక్కసారి మరియపోల్ ను సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: