ఆ ఒక్క వ్యాక్సీన్‌తో లక్షల కోట్లు దోచుకున్నారా?

కరోనాకి వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థలు బాగా లాభాన్ని సంపాదించాయి అని తెలుస్తుంది. అయితే ప్రపంచంలో అందరి దగ్గర దోచుకుని తినే దేశంగా విమర్శలు ఎదుర్కొనే అమెరికాకు సంబంధించిన మోడ్రనా కంపెనీ ఆదాయం అనైతికం అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటంటే అమెరికా లోని జనానికి వ్యాక్సిన్ ఫ్రీగానే ఇచ్చారు. ఆ వ్యాక్సిన్ డబ్బుల్ని అమెరికా ప్రభుత్వమే భరించింది. ఇప్పుడు వాటినే బయట అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దానికి 130డాలర్లు అంటే మన రేటులో 10,500రూపాయల రేటు కూడా పెట్టారు.

వాస్తవంగా అంతకుముందు 26డాలర్లకి ప్రభుత్వానికి ఇస్తే ఇప్పుడు 130డాలర్లకి జనానికి అమ్ముతున్నారు అంటే ప్రైవేట్ గా అమ్మడానికి వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్ అనే పేరుతో పేషెంట్ ఇంపాక్ట్ లైఫ్ సేవింగ్ మెజర్స్ అనేటువంటి పేరుతో భారీ ఎత్తున రేట్లు పెట్టి అమ్మితే సామాన్యుడు ఎలా భరిస్తాడని, వీళ్ళు లాభాలు ఏ మేరకు సంపాదించారంటూ "కార్పొరేట్ గ్రీడ్" అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు అక్కడ.

దాదాపు 2.85డాలర్లు దీని తయారీ కాస్ట్ అంటే, 3డాలర్ల ఆ వాక్సిన్ ని ప్రభుత్వం 26డాలర్లకు అమ్మితే, ప్రైవేటుగా 136 డాలర్లకు అమ్ముతున్నారు. ఇప్పటికే వాళ్లు 18బిలియన్ డాలర్లు పైగా సంపాదించారని ఒక ప్రజా ప్రతినిధి డీటెయిల్స్ తో సహా బయటపెట్టాడు.  దీంట్లో కీలకమైన రాబర్ట్ లాంగర్ అనే ఒక హెడ్ కి 1.7బిలియన్ డాలర్లు, అలాగే తిమాతి స్ట్రింగర్ కు 2బిలియన్ డాలర్లు, నుబార్ అటియాన్ కి 1.7బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని, స్విఫాన్ బన్సార్ సీ.ఈ.ఓకి 4బిలియన్ డాలర్ల ఆస్తి వచ్చింది.

మోడరన్ ఇప్పుడు రిచ్ కంట్రీస్ నుండి ప్రీమియం తీసుకుని సంపాదించుకుంటుంది అని చెప్తున్న నేపద్యంలో అక్టోబర్ లో 1మిలియన్ పేదలకు సహాయం చేశామని ప్రకటించింది.  2022లో పేదలకు 100మిలియన్ డాలర్ల డోసులు ఫ్రీగా ఇస్తామని, ఇవ్వకపోగా 130డాలర్లు తీసుకోవడం ద్వారా విపరీతంగా దోచుకున్నారనే చర్చ తెరపైకి వచ్చిందని కొంతమంది అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: