జగన్ ఆలోచించుకోకపోతే.. డేంజరే?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి అంత తేలికైన విషయం కాదు. కానీ దాన్ని వారు లైట్ గా తీసుకుంటే మాత్రం రాబోయే ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం తప్పదు. ఎక్కడైనా ఎన్నికల్లో ఓటమి చెందితే దాని పూర్వ పరాలు తెలుసుకొని విశ్లేషణ చేసుకోవాలి.

కానీ ఆ ఎన్నికలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ వైసీపీ నాయకులు కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో కొన్ని సంస్థలు ఆయా నియోజకవర్గ స్థాయిలోను శాంపిల్ గా 1000 మంది ఓటర్లను అడిగి మొత్తం ఎవరు గెలుస్తారో అంచనా వేస్తారు. అది చాలా మటుకు నిజం అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 స్థానాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు చోట్ల టీడీపీ జయకేతనం ఎగురవేసింది. మరో చోట వైసీపీ గట్టి పోటీ ఇచ్చిన గెలవలేకపోయింది.

కాబట్టి ఎక్కడ ఎవరు ఏ పార్టీ అయినా తక్కువ అంచనా వేయకూడదు. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి అనుకూలంగా ప్రచారం చేసుకోగలగాలి. అంతే కానీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. మమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు అన్న భ్రమలో  ఉండిపోకూడదు. కాబట్టి వైసీపీ నేతలు మళ్ళీ ప్రజాక్షేత్రం లోకి వెళ్లి తేల్చుకోవాల్సిన అవరసం వచ్చిందని రాజకీయ నాయకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన అధికారం దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు అన్ని ఏకమై వైసీపీ ని ఓడించాలని పట్టుదలతో ఉన్నాయి. అయితే  సీఎం జగన్ తన శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకొని ఎన్నికల యుద్ధంలో తాను గెలిచి తన పార్టీని గెలిపించుకోవాలంటే మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని రాజకీయ మేధావులు, నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: