ఆ సంఘానికి ఊహించని షాక్‌ ఇచ్చిన టీడీపీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పీడీఎఫ్ మాయం అయినట్లుగానే కనిపిస్తోంది. ఒక అధ్యాయం ముగిసినట్లుగానే భావిస్తున్నారు. టీడీపీ, కమ్యూనిస్టులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. కమ్యూనిస్టుల అనుబంధ సంస్థే పీడీఎఫ్. పార్టీ చెప్పినట్లు ఉద్యోగ సంఘాలు నడిచేవారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లో నాయకులు మాత్రం పార్టీ చెప్పినట్లు వింటున్నారు. కానీ ఉద్యోగ సంఘాలు వినడం లేదని తెలుస్తోంది.

పీడీఎఫ్ అనేది ఉద్యోగ సంఘం. విద్యార్థి దశలో ఉద్యమాలు చేసి, వివిధ ఎన్నికల్లో పోటీ చేసి, ఉపాధ్యాయ వృత్తి చేపట్టే వారు. వీరు కమ్యూనిస్టు భావజాలం కలిగిన వారు ఉంటారు. కమ్యూనిస్టుల పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు పీడీఎఫ్ ఉద్యోగ సంఘం పోటీ చేయకుండా ఉంటే సరిపోయేది కదా.. పోటీలో నిలబడింది. పీడీఎఫ్ మద్దతు ఉంటుందని కమ్యూనిస్టులు చెప్పారు.

బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఓట్లు టీడీపీకి పడతాయి. కానీ టీడీపీ ఓట్లు మాత్రం బీజేపీకి పడవు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీతో కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకుంటే ఇక్కడ కూడా టీడీపీ పార్టీకి కమ్యూనిస్టుల ఓట్లు పడతాయి. మళ్లీ టీడీపీవి కమ్యూనిస్టులకు పడవు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో వైసీపీ గెలుచుకుంది. ఇక్కడ టీడీపీ ఓట్లు  పీడీఎఫ్ కు పడలేవు. దీంతో ఓడిపోవాల్సి వచ్చింది.

గ్రాడ్యుయేట్ దాంట్లో తెలుగుదేశంకు పీడీఎఫ్ ఓట్లు పడ్డాయి. అక్కడ టీడీపీ గెలిచింది. మరి రెండు చోట్ల మద్దతు తెలపాలని అనుకున్న సమయంలో ఒక చోట ఓట్లు వచ్చి మరో చోట ఓట్లు రాకపోవడం అనేది దారుణమైన విషయం. 5 స్థానాల్లో కనీసం 4 స్థానాలు గెలుచుకునే సత్తా ఉన్న పీడీఎఫ్ 5 స్థానాల్లో ఓడిపోవడం ఆ సంస్థకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. ఈ విధంగా శాసన మండలిలో పీడీఎప్ కు స్థానం లేకుండానే పోయింది. అందుకే స్వతంత్రంగా నిలుచున్న గెలిచే స్థానాల్లో పొత్తు పెట్టుకుని తనకు తానుగా పీడీఎఫ్ ఓడిపోయిందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: