భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

అండమాన్ నికోబార్ ద్వీపంలో లక్షన్నర ఓట్లు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భద్రతా పరంగా ఇది అత్యంత కీలక ప్రాంతం. చైనాకు దగ్గరగా ఉన్న ప్లేస్, చైనా మీద నిఘా పెట్టేందుకు అనువైన స్థలం అండమాన్ నికోబార్ దీవులు.
ఇది మలక్కర్ జలసంధికి దగ్గరగా ఉంటుంది. చైనా సముద్ర భాగాల్లో ఇప్పటికే ఎక్కువగా జనాభా ఉంటోంది. ఇన్ని రోజులు దీన్ని ఇండియా పట్టించుకోలేదు. ప్రస్తుతం భారత్ నికోబార్ లో భారీ స్థావరం ఏర్పాటు చేయబోతుంది. హిందూ మహా సముద్ర భాగంలో పట్టు కోసం భారత్ ఇక్కడ భారీ స్థావర ఏర్పాట్లు చేస్తున్నారు.

చైనాకు ఇది కీలక పాయింట్. చైనాకు ఏడాదిలో దాదాపు లక్ష నౌకలు చేరుకుంటాయి. అవి ఆయిల్ ను తీసుకెళ్లే నౌకలు కావడం ఇక్కడ విశేషమైన అంశం.  అయితే ఈ లక్ష నౌకల్లో దాదాపు 60 శాతం వరకు మలక్క జలసంధి నుంచే వెళుతుంటాయి. చైనా భారత్ చుట్టూ పక్కలా దేశాల్లో పాగా వేస్తుంటే, ప్రస్తుతం ఎత్తుకు పై ఎత్తు అన్నట్లు ప్రస్తుతం చైనాకు వెళ్లే దారుల్లో భారీ స్థావరాలు ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం అక్కడ భారీ స్థావరం ఏర్పాటు వల్ల భారత్ కు ఎక్కువ లాభం చేకూరుతుంది. చైనా చేసే ప్రతి పనిని దగ్గరగా పరిశీలించవచ్చు.

అది ఎలాంటి చర్యలు తీసుకున్న ఈ స్థావరం నుంచి గమనించవచ్చు. దీని వల్ల భద్రత పరంగా భారత్ అత్యంత పటిష్టంగా తయారు కానుంది. ఇన్ని రోజులు ఈ దీవులను పట్టించుకోని ప్రభుత్వం ప్రస్తుతం భారీ స్థావరం ఏర్పాటు వల్ల చైనాకు చెక్ పెట్టొచ్చని ప్రణాళిక రచించుకుంది. ముఖ్యంగా భారత్ ను నలుమూలల నుంచి దాడి చేసే విధంగా ప్రణాళిక వేసుకున్న చైనాకు ఇది పెద్ద ఎదురు దెబ్బ. ఈ స్థావరం ఏర్పాటుతో రానున్న రోజుల్లో భారత్ కు ఎలాంటి మేలు జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: