వచ్చే ఎన్నికల్లో పవన్‌.. కాపులనే నమ్ముకున్నారా?

కాపు నాయకులు సమాజానికి పెద్దన్న పాత్ర పోషించాలని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కోరారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సమావేశంలో హరిరామ జోగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పవన్ ఇదే మాట్లాడారు. ఆవిర్భావ సభలోనూ పవన్ ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. రాజకీయ సాధికారతకు కాపులు అందరూ ఏకం కావాలన్నారు.

ప్రస్తుతం కులాలను విడగొట్టి లబ్ధి పొందే నాయకులే రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు.  2008,  09 ఘటనలు నాలో మరింత పంతాన్ని పెంచాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉపాధి, ఉద్యోగాలు కావాలని అడిగే స్థాయిలోనే ఇంకా ఉన్నామన్నారు. పెద్ద కులాలతో గొడవలు వద్దు. అన్ని కులాలను సమానంగా చూడాలి.సంఖ్యా బలం ఉన్న కులాల్లో ఎప్పుడు ఐక్యత ఉండదన్నారు.

ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపులు అధికారానికి దూరం గా ఉన్నారు. కులం నుంచి నేను ఎప్పుడూ పారిపోనన్నారు. కాపులు అధికారంలోకి వస్తే అందరినీ తొక్కెస్తారనే విష ప్రచారం జరిగింది. దీన్ని పోగొట్టాలని అన్నారు. ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనన్నారు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. వాస్తవికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఇతర పార్టీల ఎజెండాను మోయం, వెయ్యి కోట్లతో పార్టీని నడిపే వాళ్లం కాదన్నారు. పార్టీని నడపాలంటే భావన, బలం ఉండాలన్నారు.

కాపులంతా ఓటేస్తే నేను భీమవరం, గాజువాక లో గెలిచే వాడినని పవన్ స్పష్టం చేశారు. పదేళ్లుగా మాటలు పడ్డాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అండగా నిలబడతామని చెప్పారా. అయినా వైసీపీకి ఓటేసి జగన్ ను గెలిపించారు. కుల ఆత్మగౌరవం అని చెప్పుకునే కాపు నాయకులు, వైసీపీ ఎలా ఓటేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. 2024 ఎన్నికలు చాలా కీలకం. సంఘాలను ఐక్యం చేసుకుని ముందుకు సాగితే దక్షిణ భారత దేశంలో మనం బలమైన శక్తిగా ఎదుగుతామని పవన్ ప్రకటించారు. మన సత్తా చాటేందుకు 2024 ఎన్నికలు చాలా ముఖ్యమైనవి అని కలిసి వెళ్లి ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యమని పవన్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: