బ్రిటన్‌ ట్రబుల్‌: రిషి సునాక్‌కు ఇక్కట్లు?

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ కు సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే శరణార్థులుగా వస్తున్న వారిని అడ్డుకోవడమే తాను చేస్తున్న చెడ్డ పని అన్నట్లు పౌర హక్కులు, మానవ హక్కుల సంఘాల వారు రిషి సునాక్ పై  విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ లో విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువ మంది శరణార్దులుగా ఉంటూ తమకు కూడా స్వేచ్చ కావాలని కోరుకుంటున్నారు. తమను బ్రిటన్ పౌరులుగా గుర్తించాలని కోరుతున్నారు.

అయితే ఇక్కడ ఒక సమస్య ఎదురవుతుంది. ఎక్కడి నుంచో వచ్చి రోడ్ల మీదనే ప్రార్థనలు చేసే పరిస్థితి వచ్చినా ఇప్పుడు ఏమీ అనలేని పరిస్థితి బ్రిటన్ ప్రభుత్వానిది. అయితే బ్రిటన్ ప్రధాని చెబుతున్న అంశం ఏమిటంటే బ్రిటన్ కు వారు వలస రావడం లేదు. కావాలనే కొన్ని ముఠాలు వారి నుంచి డబ్బులు తీసుకుని పడవల ద్వారా లండన్ కు చేర్చుతున్నారని పేర్కొన్నారు.

ఈ ముఠాలు రువాండ నుంచి వలస, శరణార్థుల వద్ద డబ్బులు తీసుకుని మిమ్మల్ని బ్రిటన్ లో దింపేస్తామని మానవ అక్రమ రవాణకు సిద్ధపడుతున్నారు. ఇలా చేస్తున్న క్రమంలో వీరిని అడ్డుకోవడంలో తప్పేముందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అంటున్నారు. నిజంగా శరణార్థి అయితే తప్పు లేదు. కానీ ఎక్కడి నుంచో కావాలని వచ్చే వారినే ఆపుతున్నామని ఆయన అన్నారు.

కానీ ఇవేవీ పట్టనట్లు పౌర హక్కులు, ప్రజా సంఘాలు, చివరుకు రిషి సునాక్ పార్టీ లోని కొందరు వ్యక్తులే తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ఆయన చేస్తున్నమంచి పనికి హర్షించాల్సింది పోయి రిషి సునాక్ ను విమర్శిస్తున్నారు. గతంలో ఉన్న పాలకులు విడిచిపెట్టిన విధంగా ఎవరిని పడితే వారిని రానిస్తే చివరకు బ్రిటన్ లో ఆ దేశ పౌరులు స్వేచ్ఛగా తిరిగే రోజులు పోతాయి. వారే ఆ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగులుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: