అబ్బాయిలే అమ్మాయిలుగా.. చైనాలో జబర్దస్త్‌ ?

చైనాలో కొత్త రూల్స్ వచ్చేశాయి. అసలు లో దుస్తుల అడ్వర్టజ్ మెంట్ లో అమ్మాయిలను అసలు తీసుకోకూడదని చైనా నిషేధం విధించింది. ఆన్ లైన్ లో అమ్మాయిలు లో దుస్తులు వేసుకునే వీడియోలు చేయరాదని నిషేధం విధించడంతో కొన్ని సంస్థలు నష్టపోతున్నట్లు అమెరికాలోని న్యూ యార్క్ టైమ్స్ లో  వచ్చింది.

ఇప్పుడు అక్కడి ఆన్ లైన్ సంస్థలు అమ్మాయిలు వేసుకునే లో దుస్తుల ప్రకటనల్లో అబ్బాయిలను నటింప జేస్తున్నారు. అక్కడి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కువగా ఈ ప్రకటనలు వస్తున్నాయి.  ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిల తో లోదుస్తుల వ్యాపార ప్రకటనలు ఇవ్వద్దని చైనా చట్టం చేసింది. ఎక్కడైనా ఎవరి దుస్తులకు సంబంధించి వారితో ప్రకటనలు, ప్రచారం చేస్తుంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే చైనాలో అబ్బాయిలు అమ్మాయిల లో దుస్తుల తో ప్రకటనలు చేయడంతో విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.

కొందరయితే అమ్మాయిల లో దుస్తుల్లో అబ్బాయిలే చాలా అందంగా కనిపిస్తున్నారని అన్నారు. మరికొందరు షేక్ స్పియర్ కాలంలో అమ్మాయిలు ప్రచారం చేయడానికి ఉండేది కాదన్నారు. అమ్మాయిల వేషధారణలో అబ్బాయిలు కనిపించే వారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా చైనా తీసుకున్న నిర్ణయంపై వివిధ రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. చైనా ఈ నిర్ణయం గురించి సమాధానం చెప్పింది. లో దుస్తుల ప్రకటనలో  అమ్మాయిలు కనిపించడంతో అబ్బాయిలు చపలచిత్త వాదులుగా మారుతున్నారని చెప్పింది.

దీంతో వారు దారి తప్పుతున్నట్లు వారిని అదుపులో ఉంచాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని అన్నారు. చైనా నిర్ణయాన్ని కొన్ని వర్గాలు సమర్థిస్తున్నా.. మరి కొంతమంది ఇది అరాచకం అని వాదిస్తున్నారు. యువత సక్రమ మార్గంలో నడవాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరి అని చెబుతున్నారు. డ్రాగన్ కంట్రీ ఏదీ చేసిన సంచలనమే. సరికొత్త విధానాలను ప్రవేశపెట్టి వాటిని అమలు పరచడంలో ముందు వరుసలో ఉంటుంది. మరి ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల్లో ఎలాంటి కామెంట్లు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: