మెడికో ప్రీతి ఆత్మహత్యకు అసలు కారణం ఇదీ?

ప్రీతి ఉదంతంలో  తాజాగా కొన్ని వాట్సాప్ చాట్ లు బయటకొచ్చాయి. ప్రీతి విషయంలో సైఫ్ లైంగికంగా వేధించలేదు. దాడులు చేయలేదు. కానీ మానసికంగా ఆమెను ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ లో సీటు పొందిన వ్యక్తి అంటూ హేళన చేయడం, అదే విషయాన్ని పదే పదే వాట్సాప్ గ్రూపుల్లో సైఫ్, ప్రీతి గురించి పెట్టడం జరిగింది. ప్రీతి తయారు చేసిన రిపోర్టును బ్రెయిన్ లెస్ అని సైఫ్ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది.

ఏదైనా ఉంటే నేరుగా చెప్పాలి. కానీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం ఏంటని సైఫ్ ను నిలదీసింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే హెచ్ వోడీకి  కంప్లైంట్ చేయండి. కానీ ఇలా గ్రూపుల్లో పెట్టొద్దని సైఫ్ ను కోరింది. కానీ సైకో మనస్తత్వం ఉన్న సైఫ్ అస్సలు పట్టించుకోలేదని తెలుస్తోంది.. పదే పదే వాట్సాప్ లో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. జూనియర్ అనే చిన్నచూపు చూసేవాడు. ప్రీతి ఇద్దరు లేడీ సీనియర్లకు చెప్పినా.. వారు కూడా సైఫ్ కే మద్దతు పలికారు. ఆమెను పట్టించుకోలేరు.

ఇలా ప్రశ్నించిన ప్రీతిని వేధించమని సైఫ్ తన స్నేహితుడు భార్గవ్ కు చెప్పాడని తెలుస్తోంది. ఆర్ఐసీయూలో టెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయమని చెప్పాడు. దీంతో ప్రీతి హెచ్వోడీకి కంప్లైంట్ చేసింది. డాక్టర్ మురళీ, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో సైఫ్ కు, ప్రీతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా సైఫ్ తన సైకో బిహెవియర్ ను మార్చుకోలేదు. ఇంకా ఎక్కువగా వేధించడం మొదలుపెట్టాడు.

దీంతో ఆమె మరుసటి రోజు ఆత్మహత్యకు పాల్పడింది.  జూనియర్ ను వేధించడం మాని ఆమెకు సంబంధించిన విషయంలో కాస్త సైఫ్ తగ్గినా ఈ రోజు ప్రీతి ప్రాణాలు దక్కేవి. అలాగే క్షణికావేశంలో ప్రీతి తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. ఆమె కాస్త ఆలోచిస్తే ఈ రోజు ప్రాణాలతో ఉండేది. ప్రీతి తల్లిదండ్రులకు గుండె కోత తప్పేదంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: