డ్రోన్లు, మిస్సైళ్లు.. రూట్‌ మారిన ఉక్రెయిన్‌ యుద్ధం?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తీసుకుంది. ఇప్పటి వరకు మిస్సైల్స్, బాంబుల దాడితో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భవన శిథిలాలు తప్ప ఏమి కనిపించవు. రష్యా వద్ద ఆయుధ సంపత్తి చాలా ఉంది. కానీ ఉక్రెయిన్ వద్ద ఏడాదిగా సాగుతున్న యుద్ధంతో ఆయుధాలు, బాంబులు లేక తీవ్ర ఇబ్బంది పడుతోంది. నాటో దేశాలు, అమెరికా చేసే ఆయుధ సాయంపై నే ఆధారపడి యుద్ధాన్ని కొనసాగిస్తుంది. అయితే ఇంత జరుగుతున్న ఉక్రెయిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గమని చెబుతోంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. డ్రోన్లతో మిస్సైల్స్ ను కూల్చి వేయడం. ఈ విధానం సక్సెస్ కావడంతో రష్యాను ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. కొన్ని కోట్ల విలువ చేసే మిస్సైల్స్ ను డ్రోన్లు కూల్చి వేస్తున్నాయి. దీని వల్ల రష్యాకు అపార నష్టం కలుగుతోంది. ఉక్రెయిన్ 30, 40 డ్రోన్లతో ఒక్కసారిగా రష్యా సైన్యాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేయాలనుకుంది.

కానీ రష్యా ఇలాంటి డ్రోన్ల వ్యవస్థ ఉన్న దేశాలు, చైనా, టర్కీ, నుంచి సాయం తీసుకుని ఉక్రెయిన్ చేసే దాడులను తట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే డ్రోన్లు చూడటానికి చిన్న వే కానీ అది మోసుకొచ్చే బాంబులతో కొన్ని కోట్ల విలువ చేసే మిస్సైల్స్ ధ్వంసం అయిపోతున్నాయి. కాబట్టి రష్యా డ్రోన్లను కూల్చివేసే వ్యవస్థను సిద్ధం చేసుకుంది.

డ్రోన్లు వచ్చి దాడి చేయకముందే రష్యా తెచ్చి పెట్టుకున్న సరి కొత్త టెక్నాలజీ దాడి చేయకుండా ఆపేస్తాయి. కాబట్టి రష్యా తాము పడుతున్న ఇబ్బందిని గమనించి టెక్నాలజీని ఉపయోగించి ఉక్రెయిన్ చేస్తున్న డ్రోన్ల దాడిని తట్టుకుంటుంది. దీని వల్ల వేల కోట్ల మిస్సైల్స్ ను కాపాడుకుంటుంది.. అదే సమయంలో దాడిని మరింత పెంచేసేంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో  మిస్సైల్స్, డ్రోన్ల పాత్రే ఎక్కువగా ఉంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: