శభాష్‌.. అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది!

ఆంధ్రప్రదేశ్ లో తాజా విశేషం ఏమిటంటే, దేశవ్యాప్తంగా పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 2021- 22 సంవత్సరంలో, దేశవ్యాప్తంగా 1000 మంది అబ్బాయిలకు 960 మంది అమ్మాయిలు ఉంటే, ఆశ్చర్యకరంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఆ సంఖ్య 1000 మంది అబ్బాయిలకు 1046 ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో కేరళ 1,114 మంది అమ్మాయిలతో ప్రథమ స్థానంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ 1046 తో  రెండో స్థానంలో ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. గ్రామాల్లో కంటే పట్టణాల్లో అమ్మాయిల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. అమ్మాయిల సంఖ్య పరంగా కేరళ ప్రథమ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం లోనూ, ఆ తర్వాత 1,031 నిష్పత్తి తో హిమాచల్ ప్రదేశ్ మూడవ స్థానంలోనూ ఉన్నాయి . ఆ తర్వాత 1,026 నిష్పత్తి తో తమిళనాడు, 1,017 నిష్పత్తి తో మేఘాలయ, 1,016 నిష్పత్తి తో ఛత్తీస్ ఘడ్ , 1,001 నిష్పత్తి తో జార్ఖండ్ ఇలా వరుసగా ,అమ్మాయిలు అబ్బాయిలతో పోలిస్తే ఈ విధమైన నిష్పత్తి లో ఉన్నట్లు కేంద్రం తన నివేదికలో పేర్కొంది.

ఒకప్పుడు అబ్బాయిల సంఖ్య పెరిగిపోయి అమ్మాయిలు సంఖ్య తగ్గిపోయిన దశ మారి, ఇప్పుడు అమ్మాయిల సంఖ్య పెరిగిపోయి అబ్బాయిల సంఖ్య తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. గత 15, 20 ఏళ్ల నుండి ఇద్దరైనా పర్లేదు, ఒక్కరైనా పర్లేదు అని అమ్మాయిలను కనడం వల్ల, ఇలా సాధారణంగా చాలామంది అనుకోవడం వల్ల అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది.

సంతానంగా ఆడపిల్ల పుట్టిందని వడ్ల గింజ వేసి చంపేసిన సంఘటనలు, ఆడపిల్ల పుట్టిందని తెలియగానే రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయిన సంఘటనలు గతంలోనే కాదు . ఇప్పుడు కూడా దేశ వ్యాప్తంగా ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి.  పటిష్ట చట్టాల్ని అమలు చేస్తున్నామని చెబుతున్నా... ఆచరణలో సాధ్యం కావడం లేని పరిస్థితుల్లో, దేశవ్యాప్తంగా ఇలా అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరగడం మాత్రం ఒక శుభ సూచకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: