జగన్ హయాంలో ఇన్ని పరిశ్రమలు వచ్చాయా?

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు రావడం లేదు. వచ్చినవి కూడా పారిపోతున్నాయనే పరిస్థితి తయారైందని ప్రతిపక్ష పార్టీలు, టీడీపీ గగ్గోలు పెట్టాయి. ఎవరూ పారిపోలేదు. కానీ అమర్ రాజా లాంటి సంస్థలు ఆంధ్రలో పెట్టుబడి పెట్టకుండా తెలంగాణలో పెడితే ఇక్కడ ఎందుకు ఆ సంస్థకు అవకాశం ఇవ్వలేదని ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేశారు.  అయితే జగన్ వచ్చాక ఏమేం ఇండస్ట్రీస్ వచ్చాయో ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

గ్రాసిన్ ఇండస్ట్రీస్ రూ.800 కోట్ల పెట్టుబడితో వచ్చిన సంస్థ ఇందులో దాదాపు 800 మందికి ఉపాధి లభిస్తుంది. ప్యానల్ ఆప్ టు డిస్ ప్లే టెక్నాలజిస్, 1200 కోట్ల పెట్టుబడి, 2200 మందికి ఉపాధి, ప్యాక్స్ లింక్ ఇండియా లిమిటెడ్ 1050 కోట్లు,నన్నీ ఓప్పా టెక్ 200 కోట్లు, రామ్ కో సిమెంట్ 1790 కోట్లు, కాస్టిక్ సోడా, టీవీ డిస్ ప్లే బోర్డ్స్, ప్రింటెడ్ మ్యాడ్యల్స్, ఏటీసీ టైర్స్, ఆప్ హైవే టైర్స్, అనే సంస్థలు సీఎంగా జగన్ వచ్చిన తర్వాత ప్రారంభం అయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

ఆదిత్య బిర్లా గార్మంట్, ఇంటిలింజెంట్ సెంచరీ ప్యానల్స్, హిల్ టాప్ సెర్చ్ ఫుట్ వేర్, పిడిలైట్ ఇండస్ట్రీస్, హైనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్,అస్తిమాస్ డ్రగ్స్, విన్ విన్ స్పెషాలిటీ ఇన్సూరేటర్స్, థెరాక్స్ లైఫ్ సైన్సెస్, సెనాస్టిక్ ల్యాబ్స్, ఇషా రిసోర్సెస్, అసాగో ఇండస్ట్రీస్, జెెెఎస్ డబ్ల్యూ స్టీల్స్, లాంటి సంస్థలు తమ హయాంలో భూమి పూజ చేసుకుని పనులు జరుగుతున్నాయని త్వరలోనే ప్రారంభమవుతాయని ప్రకటించుకున్నారు.

వీటిలో ఏవి నిజమో కాదో వచ్చినవో లేదో ప్రతిపక్ష టీడీపీ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుందో చూడాలి. కాదు వీటిలో ఎన్ని టీడీపీ హయాంలో వచ్చాయని చెబుతారో, లేక రానివి వచ్చినట్లు చెప్పినట్లు ప్రభుత్వం ప్రకటించిందని విమర్శలు చేస్తారో.. చూడాలి. ఏదేమైనా ప్రభుత్వం ఇండస్ట్రీస్ వచ్చినట్లు ప్రకటించడం టీడీపీ చేస్తున్న విమర్శల్ని ఎదుర్కొవడానికే అని అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: