వారెవా.. కేసీఆర్‌ పోరాట పటిమ అద్భుతమే?

కేసీఆర్ ని ఒక విషయంలో అభినందించాలి.. జాతీయ పార్టీగా మారాలి అనుకున్న తర్వాత చోద్యం చూస్తూ కూర్చోకూడదు. ప్రతి ఎన్నికల్లో పోటీకి దిగాలి. ఆయన బి.ఆర్.ఎస్ ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేస్తారు అనుకున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే కొత్త గాబట్టి ఎంటర్ అవలేదు. పాత పార్టీ అయిన జనసేన కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

మహారాష్ట్రలో జరిగే స్థానిక ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పోటీ చేయాలనుకోవడం ఇప్పుడు శుభ పరిణామం. మన తెలుగు పార్టీ పక్క రాష్ట్రంలో పోటీకి అధికార పార్టీ ముహూర్తం ఖరారు చేసింది. మహారాష్ట్రలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవ్వాలని నిర్ణయించి, బి.ఆర్.ఎస్ కి సంబంధించి కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నేతలతో పాటు ఇతర రాష్ట్రాల నాయకులతో సమావేశాలు నిర్వహించారు.

అక్కడ ఒక పంచాయతీ నెంబర్ పరిధిలో 3 వరకు జడ్పిటిసి మెంబర్స్, 6 వరకు ఎంపిటిసి మెంబర్లు ఉండడంతో అన్నిచోట్ల పోటీకి దిగాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలో బి.ఆర్.ఎస్ ఇన్చార్జిలుగా తెలంగాణకు సంబంధించిన వాళ్లనే నియమించబోతున్నారు. ఆదిలాబాద్ కు ఆనుకుని ఉన్న మహారాష్ట్రలో యావత్ మాల్, వాగ్దా, వాసిం జిల్లాలకు అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే జోగి రామన్న, మాజీ ఎంపీ గోరంట్ల నగేష్ ఇన్చార్జులుగా మూడు జిల్లాలకు వీళ్ళిద్దరిని ప్రకటించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ఇప్పుడు బాల్క సుమన్ కి చంద్రపూర్, గడ్చిరౌలి జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ఇంతకుముందు ఒక్కొక్కరికి ఒక్కో జిల్లా బాధ్యతలు ఇవ్వాలని భావించారు. కానీ ఇప్పుడు  రెండు మూడు జిల్లాల బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీసీబీ చైర్మన్ ఆర్ డి భోజా రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు అరిగల నాగేశ్వరరావు, పురాణం సతీష్ ల సేవలను కూడా వినియోగించుకుంటారట. వీళ్లకు ఒక్కో జిల్లాను ఇవ్వబోతున్నారు. మరి కేసీఆర్ ఎలాంటి ఫలితం అందుకుంటారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: