ఆ నగరాల పేర్లు మార్పు.. యోగి తగ్గట్లేదుగా?

యూపీలో ముఖ్యమంత్రి యోగీ  ప్రస్తుతం యూపీలో చాలా నగరాలకు పేర్లను మార్చే ప్రక్రియ చేపట్టారు. ఎంతమంది వ్యతిరేకించినా, ఎవరు అడ్డుకున్నా తన పంథాలో తాను పోతూ మొగల్ రాజుల పేర్లు ఉన్న కొన్ని నగరాలను మార్చాలని నిర్ణయించారు. అందులోనిది మొదటిది ఔరంగాబాద్ దీన్ని ఇప్పుడు ఛత్రపతి శివాజీ తనయుడు శాంబాజీ పేరును పెట్టడానికి నిర్ణయించారు. ఔరంగాబాద్ ను శాంబాజీ నగర్ గా పేరు మార్చారు. దీనికి కేంద్రం కూడా అంగీకరించింది.

నిజాం నవాబుకు సంబంధించిన ఉస్మానాబాద్ పేరును తొలగించి ధారాశివగా పేరును మార్చారు. కొంతమంది ఇంకా దేశంలో హిజుబుల్ ముజాహీదిన్, కసబ్ పేర్లను పెట్టాలని డిమాండ్ చేసే రోజులు వస్తాయేమో. అయితే యూపీ లో ముస్లింల జనాభా ఎక్కువగానే ఉంటుంది. అయినా యోగీ ఆదిత్యనాథ్ ఏ మాత్రం తొణుకు, బెణుకు లేకుండా పరిపాలన సాగిస్తూ పట్టణాలకు తాను ఆనుకున్న పేర్లను పెడుతున్నారు. దీనికి కేంద్రం కూడా అంగీకారం తెలపడం ఒక రకంగా ఆయనకు మద్దతు పలికినట్లే లెక్క. ఇప్పటికీ యూపీలో ఇంకా పేర్లు మార్చాల్సిన నగరాలు, పట్టణాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. మరి వాటికి పేర్లు పెట్టే సమయంలో ఎలాంటి మార్పులతో ఏయే పేర్లు పెడతారో చూడాలి.

దేశద్రోహి, దేశాన్ని ముక్కలు చేయడంలో మత ఘర్షణలు రేపి హిందువులను ఊచకోత కోసి రైళ్లలో భారత్ కు పార్సిల్ చేయించిన వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. అంతకుముందు రోజుల్లో అరాచకాలు చేసిన కొంతమంది ముస్లిం యువకులను జైళ్ల నుంచి విడిపించినందుకు ఆయన కోసం ప్రత్యేక టవర్ ను కట్టారు గుంటూరులో. అయితే దేశాన్ని ముక్కలు చేసిన తర్వాత దాన్ని పక్కన బెట్టొచ్చు కదా.. కానీ ఆ టవర్ ను ఇప్పటికీ తీసేయాలంటే కొంతమంది అడ్డుకుంటారు.

ఇప్పటికీ భారతదేశంలో జిన్నాకు సంబంధించిన టవర్ ఉందంటే దాన్నితీసేయాలని ప్రయత్నిస్తే అడ్డుకునే వాళ్లు ఉన్నారంటే అంతకన్నా దరిద్రం మరొకటి ఉండదనుకోవచ్చని కొందరు విమర్శిస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: