దేశ ఆధ్యాత్మిక రాజధానిగా అయోధ్య?

అయోధ్య రామాలయం నిర్మాణం విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరూ హిందువులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మందిర నిర్మాణంలో ప్రత్యేకమైన శిలలను ఉపయోగిస్తున్నారు. సర్వంగా సుందరంగా నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. కుల మతాలకతీతంగా ఎక్కువ మంది హిందువులు ఎంతో ఆశగా వేచి చూస్తున్నారు. మరి యూపీ లోని యోగి ప్రభుత్వం అందరి ఆశలకనుగుణంగా నిర్మాణం చేస్తుందా లేదా అనేది చూడాలి.

రామాలయం జనవరిలో ప్రారంభం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ టూరిజం ప్రాజెక్టు గురించి చర్చ కొనసాగుతోంది. సరయూ నది తీర ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. కేరళ తీరంలో ఉన్నట్లు బోట్లను పెట్టి దాదాపు అందులో ఇళ్లు లాంటి సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మికతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టూరిస్ట్ ప్రాంతాల్లాగా ఉండేట్లు చూస్తున్నారు. ఎక్కడ ఆధ్యాత్మికత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

అయోధ్య చుట్టూ ఉన్న ప్రాంతాలు పూర్తి ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా అన్ని హంగులతో నిర్మించేలా చేస్తున్నారు. ధర్మ నియమాలు ఒక వైపు ఆర్థికంగా మరో వైపు బలంగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఉదాహరణకు తిరుమల దేవస్థానం వల్ల తిరుపతి సిటీ ఎంతో అభివృద్ధి చెందింది. తిరుమల దేవస్థానం ప్రచారం, కొండపైకి వచ్చే భక్తులకు సౌకర్యంతో ఒకరి నుంచి ఒకరికి నచ్చి భక్తులు తండోపతండాలుగా రావడం వల్ల ఎంతో లాభం చేకూరింది. దీంతో తిరుపతి పట్టణం ఎంతో అభివృద్ది చెందింది.

శ్రీకాళహస్తిలో కూడా ఎక్కువ మంది జనాలు బతకడానికి వారికి ఉపాధి దొరకడానికి కారణం ఆలయం, దాని ప్రాముఖ్యత. కాణి పాకం  ఆలయం పరిసర ప్రాంతాలు అభివృద్ది చెందడమే కాక ఎంతో మంది భక్తులకు మోక్షంతో పాటు అక్కడ ఉండే వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు టూరిస్టు ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: