ఆ దేశాలకు అప్పులిచ్చి పెత్తనం చేస్తున్న చైనా?

చైనా అప్పుల ఊబిలో ఆఫ్రికా దేశాలు విలవిల్లాడుతున్నాయి. డ్రాగన్ కంట్రీని నమ్ముకున్న దేశాల నెత్తిన అప్పుల కుప్పై కూర్చుంది. ఆఫ్రికా దేశాలు 700 బిలియన్ డాలర్లు చైనాకు కట్టాలి. గతంలో ఆఫ్రికా దేశాలకు అమెరికా అప్పులు ఇచ్చేది. ఆర్థికంగా అండగా నిలిచేది. 2020 లో జాంబియాకు 17 బిలియన్ డాలర్లు అప్పుగా ఇచ్చింది. ప్రస్తుతం అది డిపాజిటిర్ ప్రకటించింది. ఇప్పుడు 6 బిలియన్ డాలర్లు చైనా సంస్థలకే కట్టాల్సి ఉన్నట్లు జాంబియా తెలిపింది.

ప్రస్తుతం అమెరికా జాంబియాను ఆదుకునేందుకు ముందుకు వస్తోంది. చైనా ఏయే దేశాలకు అప్పులు ఇచ్చిందో ఆయా దేశాలతో అమెరికా ఇప్పుడు మాట్లాడుతోంది. అమెరికా ఆఫ్రికా దేశాలకు అప్పులు ఇవ్వగలదా అంటే సందేహంగానే కనిపిస్తుంది. ఇప్పటికే అమెరికా 31.4 ట్రిలియన్ డాలర్ల అప్పులు ఆఫ్రికా దేశాలకు ఇచ్చేసింది. అంటే తను ఎంత ఇవ్వగలదో అంత కంటే ఎక్కువే ఇచ్చేసింది.

ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ప్రకారం ఆఫ్రికా ఖండంలోని 54 దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. నైజీరియా, ఈజిప్టు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. అయితే లో టాక్స్, హై ఇంట్రస్ట్ రేట్ తో కాస్త మెరుగ్గా ఈ రెండు దేశాలు ఉన్నాయి. ఆఫ్రికా దేశాలకు చైనానే 12 శాతం అప్పులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా ఖండానికి క్రైసిస్ ఫండ్స్ కావాలని ప్రకటించింది.

దీనికి అమెరికా, యూరప్ దేశాలు సాయం చేయాలని కోరుతోంది. 150 బిలియన్ డాలర్లు చైనాకు ఇప్పటికిప్పుడు ఆఫ్రికా దేశాలు చెల్లించాల్సి ఉంది. ఆగస్టు లో చైనా 17 ఆఫ్రికా దేశాలకు ఇవ్వాల్సిన 23 లోన్లను క్యాన్సల్ చేసింది. 2000 సంవత్సరం నుంచి అప్పులు ఇచ్చి ఆయా దేశాలను మచ్చిక చేసుకున్న చైనా ఇప్పుడు ఇచ్చిన అప్పులను ఎలా రాబట్టుకోవాలో తెలియక సతమతమవుతోంది. మరి చైనాకు ఆ దేశాలు అప్పులు చెల్లిస్తాయా? ఇవ్వకపోతే డ్రాగన్ కంట్రీ ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: