ఆ దేశంలో.. టర్కీ తరహా భూకంపానికి ఛాన్స్‌?

ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. నమ్మలేని విధంగా ఈ మధ్యకాలంలో కేవలం 24 గంటల్లో ఏకంగా సుమారు 100 భూకంపాలు దాకా వచ్చాయి అని తెలుస్తుంది. ఈ విషయం అంతర్జాతీయ మీడియా సంస్థల రిపోర్టులు, ఇంకా భూకంప పరిశోధకులు ధ్రువీకరించిన వివరాల ప్రకారం తెలుస్తుంది.

టర్కీ, సిరియాలోనే అనుకున్నాం. ఇప్పుడు హైదరాబాదులో కూడా భూకంపాల ప్రమాదం ఉందని అంటున్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రెమర్స్ వస్తున్నాయట. దీనికి తాజా ఉదాహరణగా నేపాల్ లో 5 1/2 నుండి 6 పాయింట్ల తీవ్రతతోనూ, అలాగే తాజాగా ఢిల్లీలో కూడా మూడున్నర పాయింట్ల తీవ్రతతో భూకంపం రికార్డ్ అయ్యిందట. మొత్తంగా చూస్తే ఈ భూకంపాల ప్రమాదం మనకు ప్రస్తుతం పొంచి ఉందని తెలుస్తుంది. సిరియా సరిహద్దుల్లో హాఠే దగ్గర వచ్చిన భూకంపం ఒకటైతే తాజాగా మళ్లీ అదే సిరియాలోనూ, ఇంకా అక్కడ మాత్రమే కాకుండా ఈజిప్ట్ దేశం లోనూ, ఇంకా లెబనాన్ దేశంలో కూడా ఒక్కసారిగా వచ్చిన భూకంపాలు అక్కడ ఆందోళనను కలిగించాయి.

వీటికి తోడు నేపాల్ ఇంకా మన ఢిల్లీ వరకు కూడా ఇప్పుడు భూకంపాలు అనేవి వచ్చేసాయి. మరోవైపు టర్కీలో అవినీతి సామ్రాట్ గా పేరుగాంచిన అధ్యక్షుడు ఎర్డోగెన్  ప్రజలకు సంక్షేమం నిమిత్తం ఇస్తామన్న ఆహారం అందడం లేదని అంటున్నాడు. ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్న నేపథ్యంలో అక్కడ మేలో జరగబోయే ఎలక్షన్లకు తన వైపు మద్దతుగా నిలిచే వాళ్ళు తక్కువ ఉన్నా తన అపోజిషన్ పార్టీ అయిన నేషనల్ ఎలయన్స్ పార్టీకి మద్దతుదారులు ఎక్కువగా ఉండడంతో, భూకంపాలను కారణంగా చూపించి ఎలక్షన్లను వాయిదా వేయడానికి చూస్తున్నాడు.

ఏదైనా యుద్ధం జరిగితే ఎలక్షన్ ఆపడానికి కుదురుతుంది కాబట్టి ఎర్డోగెన్ ఇప్పుడు  20 బిలియన్ల డాలర్లతో 40 ఎఫ్16 యుద్ధ విమానాలను కొని స్వీడెన్, ఫిన్ లాండ్ దేశాలపైకి యుద్ధానికి వెళ్తాడా అనేది ఇప్పుడు సందేహం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: