గుడ్‌న్యూస్‌: పాక్‌లో మరో రాక్షసుడు చచ్చాడు?

భారతదేశం వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పాకిస్థాన్ లోని రావల్పిండి లో హత్య చేశారు. పాకిస్థాన్ లోని మన కౌంటర్ ఇంటిలిజెన్స్ బాగానే పనిచేస్తుంది. భారత దేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయినా హిజ్బుల్ ముజాహీద్ కమాండర్ ప్రారంభకుడు బషీర్ అహ్మద్ ఫీర్, అలియాస్ ఇంతియాజ్ అలంను రావల్పిండిలో సోమవారం సాయంత్రం పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు. రావల్పిండిలోని ఒక షాపు బయట అతడిని కాల్చి పడేశారు.

కీలకమైన అంశం ఏమిటంటే భారత్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పాక్ లో హతం కావడం ఒక రకంగా సంతోషించాల్సిందే. ప్రతి విషయంలో భారత్ లో దాడికి ప్రయత్నించే ఉగ్రవాదులు ప్రస్తుతం పాక్ లో ఎక్కువగా దాడులు చేస్తున్నారు. ఇప్పుడు హతమైన ఉగ్రవాది బషీర్ భారత సైన్యంపై దాడులు చేయిడానికి ఎక్కువగా ప్రణాళికలు రచించే వాడు.

అక్టోబర్ 4, 2022 న అతడిని భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లో చొరబాట్లను కారణం ఇతడు. ముఖ్యంగా ఎక్కడ చొరబడాలి, ఎవరిని అంతమొందించాలి అనే ప్రణాళికలు బషీర్ రచిస్తుంటారు. అయితే ఇతడిని అంతమొందించింది ఎవరూ అనేది తేలాలి. ఎవరూ చంపారు. ఎందుకు అంతమొందించారు. కారణాలు ఏమిటి.. రావల్పిండి చంపేశారంటే ఇన్ని రోజుల నుంచి ఎక్కడ ఉంటున్నాడు. ఈయనకు ఎవరు ఆశ్రయమిస్తున్నారు.

ఇప్పటికే పాక్ లో ఎక్కువగా ఉగ్రవాదులు తలదాచుకుంటారని ప్రపంచం కోడై కూస్తుంది. ఇప్పుడు హిజ్బుల్ ముజాహీద్ అనే సంస్థ ప్రారంభకుడిని నడి రోడ్డుపై కాల్చి చంపారంటే పక్కా సమాచారంతో చేసిన పనే ఇది. అయితే భారత్ లో చాలా ఉగ్రదాడులకు పథక రచన చేసింది బషీర్ అని భారత ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఇంకా పాక్ లో దాగి ఉన్న ముష్కరులను బయటకు లాగి అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: