ఆ రంగంలో ఏపీ దేశంలోనే నెంబర్‌ 1?

కరోనా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వైద్య సేవలను ఇంటి నుంచే పొందడం ప్రజలకు అలవాటయింది. ఏమేం మందులు వాడాలి, ఎలా వాడాలి అనేది తెలుసుకున్నారు. దీనికి టెలీ మెడిసిన్ సిస్టమ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంతో ప్రజలు ఎక్కువగా వినియోగించారు. కరోనా అనంతరం కూడా టెలిమెడిసన్ ను ఎక్కువగా ఉపయోగించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందజలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జనవరి వరకు టెలిమెడిసిన్ సేవలు ఒక కోటి 86 లక్షల మంది  ఉపయోగించారు. దేశవ్యాప్తంగా 6 కోట్ల మూడు లక్షల మందికి టెలిమెడిసన్ సేవలు అందుతున్నాయి. అందులో ఆంధ్ర మొదటి స్థానంలో ఉంది. అంటే ఆంధ్రలో 30.84 శాతం మంది దీన్ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ తర్వాత పశ్చిమ బెంగాల్ లో 86. 99 లక్షల మందికి టెలిమెడిసిన్ ద్వారా సేవలు అందుతున్నట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఒక కోటి 86 లక్షల మంది టెలిమెడిసిన్  వినియోగిస్తే పశ్చిమ బెంగాల్ లో 86 లక్షల మంది వాడుతున్నారు. తమిళనాడు లో 67 లక్షల 22 వేల మంది వినియోగించారు. కర్నాటకలో 47 లక్షలు, మహారాష్ట్రలో 34 వేల మంది, ఉత్తరప్రదేశ్ 33 లక్షలు, తెలంగాణలో 32 లక్షలకు పైగా, మధ్య ప్రదేశ్ లో 26 లక్షలు, బీహార్ లో 46 లక్షలకు పైగా మంది టెలిమెడిసన్ సేవలను వినియోగించుకుంటున్నారు.

అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ టెలిమెడిసిన్ సేవల్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా నేరుగా వైద్యుడిని సంప్రదించకుండా వైద్య సేవలు పొందొచ్చు. జ్వరం, జలుబు, దగ్గు, ఇతర రోగాలకు డాక్టర్ తో మాట్లాడి మెడిసిన్ ను తీసుకోవచ్చు. ఆ మెడిసిన్ ను ఉపయోగించుకుని చాలా మంది తమ కు వచ్చిన రోగాలను తగ్గించుకుంటున్నారు. కరోనా విపత్కరమైన పరిస్థితుల్లో మనిషి ఎలా జీవించాలో తెలిసేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: