పవన్ కల్యాణ్‌పై ఎల్లో మీడియా కుట్ర ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకే నష్టమే. సీఎం కేసీఆర్ పవన్ కళ్యాణ్ కు 1000 కోట్లు ఇస్తానని చెప్పినట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇటీవల తన పత్రికలో రాశారు. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఎవరికి నష్టం కలుగుతుంది. పవన్ కల్యాణ్ కి జరుగుతుందా.. టీడీపీ నష్టపోతుందా.. అయితే 1000 కోట్లు సీఎం కేసీఆర్  పవన్ కల్యాణ్ కు ఎందుకిస్తారనే వాదన వినిపిస్తోంది.

తెలంగాణలో  కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని తెలంగాణలో బీజేపీ అల్రెడీ చేరదీస్తోంది. వారికి ఓట్లు పడే అవకాశం ఉంది. ఆంధ్రలో కాపులంటూ ప్రత్యేకంగా ఆకర్షణకు గురైతే తప్ప బీఆర్ఎస్ కు ఓట్లు పడవు. కాపులు ఐక్యమై బీఆర్ఎస్ కు ఓట్లు వేసినా తెలంగాణలో కాపులు వేస్తారని చెప్పలేం.

అసలు పవన్ కల్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేయడమే రాధాకృష్ణ పని పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు కొందరు. ఎలాగంటే పవన్ కనక తెలుగుదేశంతో కలవకపోతే అమ్ముడు పోయావని చెప్పొచ్చు. ఒక వేళ పవన్ టీడీపీతో కలిసి పోటీ చేసినా వైసీపీ చేసే విమర్శ డబ్బులు తీసుకొని అమ్ముడు పోయాడని అంటారు. టీడీపీతో కలవకపోతే రాధాకృష్ణ చేసిన ఆరోపణ నిజమని చెప్పొచ్చచు. అదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అమ్ముడుపోయాడని విష ప్రచారం చేయడం. టీడీపీతో కలిస్తే వైసీపీ పార్టీ చేసే ఆరోపణలు టీడీపీకి పవన్ అమ్ముడుపోయాడని అంటారు.

పవన్ ను టీడీపీ అల్రడీ పొత్తు పెట్టుకోమని అడుగుతోంది. 58 సీట్లు కావాలని పవన్  అడిగారు. సీఎం పదవిలో షేరింగ్ కావాలని కోరిన విషయం తెలిసిందే. అయితే ఇవేవీ అడగకూడదని రాధాకృష్ణ వేసిన ఎత్తుగడే పవన్ ని కుట్రలో ఇరికించడం.. ప్రజల్లో పవన్ కల్యాణ్ అంటే చులకన కలిగేలా చేయడం అన్న వాదన వినిపిస్తోంది. మరి పవన్ పై వేసిన ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: