ఫ్లాష్‌బ్యాక్‌: చంద్రబాబు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు విచిత్రంగా కొనసాగుతాయి. ఇందుకు కారణాలు అనేకం ఉంటాయి. ఏపీ ని ఎలా అభివృద్ధి చేస్తారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే, ఆన్ స్థాపబబుల్ లో బాలయ్య, ప్రస్తుతం పాప్ సింగర్ స్మిత చంద్రబాబు ని ఇంటర్వ్యూ చేసింది. ఏపీని ఎలా అభివృద్ధి చేస్తారని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ చంద్రబాబు నాయుడుని ఒక ఇబ్బందికర ప్రశ్న అడిగేసింది.

మీరు ఇంటర్ ఫెయిల్ అయ్యారని అడగడంతో చంద్రబాబు నాయుడు అవును అందులో ఫెయిలయ్యాను, ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాల వద్దకు కూడా వెళ్లాను. ఆ క్షణంలో నా స్నేహితుడు ఒకరు నన్ను కాపాడాడు అని చెప్పుకొచ్చారు. అయితే నాలా ఎవరు కాకూడదు. అనేది నా అభిమతం. జగన్ చదువు పై  కూడా గతంలో తీవ్రంగానే చర్చ జరిగింది. అప్పుడు జగన్ ఏం చదివాడు, ఎక్కడ చదివాడు అనే విషయం బహిరంగంగానే అందరికీ తెలిసేలా చెప్పేశారు.

ప్రస్తుతం చంద్రబాబు కూడా ఇంటర్ ఫెయిల్ అయ్యారని విషయం బహిరంగంగా బయటకు వచ్చేసింది. ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని 13 సంవత్సరాల పాటు పరిపాలించారంటే అంత తేలికైన  విషయం కాదు.  కాబట్టి చదువుల విషయంలో విద్యార్థులు ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోకూడదు అన్నది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఈ  విషయంలో  టీ అమ్మే వ్యక్తి ప్రధాని అయినప్పుడు ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తి సీఎం గా చేయడంలో అంత విచిత్రం ఏముంటుంది అనేది ప్రజల్లో ఒక రకమైన భావన  వ్యక్తమవుతోంది.

వీళ్ళ ఇంటర్వ్యూ లు ఏమో కానీ ఏళ్ల తరబడి దాచిపెడుతున్న వ్యక్తిగత విషయాలు అందరికి తెలిసిపోతున్నాయి. దీని వల్ల ఆయా నాయకుల పై ప్రజల్లో ఉన్న అభిప్రాయం మారుతూ ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. ఏదేమైనా జగన్‌ను టెన్త్‌ ఫెయిల్ అంటున్న నారా లోకేశ్‌ మరి తన తండ్రి ఇంటర్‌ ఫెయిల్ అన్న విషయంపై ఏం చెబుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: