పాపం.. అందరికీ టార్గెట్‌గా మారుతున్న సజ్జల?

జగన్ చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ నే టార్గెట్ చేస్తాడు అంతే గాని అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు లాంటి వారిని విమర్శించడు. ఎందుకంటే ఢీకొంటే తన స్థాయిలో ఉన్న వాళ్ళతోనే ఢీకోవాలి కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఆయన సజ్జలను విమర్శిస్తున్నాడు. అతను మాత్రమే కాక కోటంరెడ్డి కూడా విమర్శిస్తున్నాడు. ఇప్పుడు ఆ లిస్టులోకి చంద్రబాబు నాయుడు కూడా చేరారు. ఎవరినైనా వ్యక్తిగత నిందలు చేయడం  వారి విచక్షణకు సంబంధించినదై ఉంటుంది.

జగన్ ని రాక్షసుడు అని వ్యక్తిగత నిందలు చేయడం అనేది కూడా అదే విచక్షణకు సంబంధించినది. ఇప్పుడు సజ్జల విషయానికొస్తే సజ్జల జగన్ చెప్పింది చేస్తాడు కానీ సొంత నిర్ణయాలు తీసుకోడు కదా! సొంత ఆలోచనతో మాట్లాడడు కదా! ఇప్పుడు పట్టాభి మాట్లాడితే చంద్రబాబు మాట్లాడినట్టా? అయ్యన్నపాత్రుడు మాట్లాడితే చంద్రబాబు మాట్లాడినట్టా? లేదంటే అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం దశ-దిశ నిర్దేశం చేస్తాడా? లేదా పట్టాభి లేదా అనురాధ తెలుగుదేశం దశ-దిశ నిర్దేశం డిసైడ్ చేస్తారా?

గతంలో జగన్ని తిట్టడానికి ఏమీ లేక విజయ్ సాయి రెడ్డిని తిట్టేవారు. జగన్ తో పోల్చుకోవాలనుకున్నప్పుడు జగన్ తెచ్చిన కొన్ని విధానాలు, సంక్షేమ పథకాలు మేము వచ్చినప్పుడు ఇస్తామనో, ఇవ్వమనో చెప్పాలి. అంతేకానీ అవన్నీ తప్పని చెప్పకూడదు లేదా ఆ పథకాలకు బదులు కొత్త పథకాలు ఇస్తామని చెప్పాలి అంతేగాని జగన్ ని రాక్షసుడు అని, దుర్మార్గుడు అని ఇలా ఇష్టం వచ్చినట్లు తిట్టడం ఎందుకన్న వాదన వినిపిస్తోంది.

అలాగే మళ్లీ మనల్ని ఎవరైనా అలా తిడితే మనం ఊరుకుంటామా అది తప్పని వాదించమా అన్నది కూడా ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని తిట్టాడనో, వల్లభనేని వంశీ తిట్టాడనో, పేర్ని నాని తిట్టాడనో అంటే ఒక అర్థం ఉంటుంది కానీ.. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిడితే లేకపోతే వాడు వీడు అని లొకేషే తిడితే తేడా ఏముంటుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: