అపకారికి ఉపకారం: టర్కీని ఆదుకున్న ఇండియా!

భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లో టర్కీ కూడా ఉండేది. పాకిస్థాన్ కు ఎల్లప్పుడూ మద్దతు పలుకుతూ కాశ్మీర్ పాకిస్థాన్ వశం చేయాలనుకున్న దేశాల్లో టర్కీ ఒకటి. అలాగే ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంలో కూడా టర్కీ సాయం చేస్తుందన్న ఆరోపణలు ఉండేవి.

అయితే ఆ దేశం అనుసరించినా విధానమో, లేక అక్కడ పాలకులు చేసినా పాపమో కాని విధి వారిని పగబట్టింది. టర్కీలో వచ్చిన భూకంపం ప్రజా జీవితాలను ఛిన్నాభిన్నం చేశాయి. అధికారికంగా భూకంప ధాటికి చనిపోయిన వారు 40 వేలమంది ఉంటే ఇంకా శిథిలాల కింద చిక్కి శల్యమైన వారు కొన్ని లక్షల్లో ఉంటారని అంచనా.

పాకిస్థాన్ తర్వాత అంతలా ఇండియాను ద్వేషించే టర్కీ ఆపదలో చిక్కుకుంటే భారత ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించకుండా వారికి సాయం చేయడానికి తన సైన్యాన్ని పంపించింది. ఆహార పానీయాలు అందించింది. అక్కడ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించడంలో వారికి సాయపడుతుంది. చిన్నారులను కాపాడుతోంది. వైద్య సేవలు అందించడంలో ముందు నిలుస్తోంది. ఇది భారతీయుల్లో ఉన్న గొప్పదనం.

భారత సనాతన ధర్మం చెప్పిన న్యాయం. పగ వాడైనా సరే కష్టాల్లో ఉంటే ఆదుకుంటామని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో స్వయంగా టర్కీ అధ్యక్షుడే భారత్ కు మేము ఎన్నో సార్లు నష్టం చేయాలని చూశాం. అయినా వారు ఈ కష్ట సమయంలో మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నారు. వారికి మేం రుణపడి ఉంటాం అని ఆయన అన్నారు. అంటే టర్కీ అధ్యక్షుడు పశ్చాత్తప పడేలా చేశామంటే దీని కంటే భారత్ సాధించేదేముంటుంది. ఇంత సాయం చేసినా భారత్ మరో అడుగు ముందుకేసి టర్కీకి రూ.200 కోట్ల సాయం చేయడానికి సిద్ధమైంది. శత్రువుకైనా సాయం చేసే గొప్ప మనసు ఈ విశ్వంలో భారత్ కు తప్ప మరెవరికి ఉంటుంది?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: