కేసీఆర్, చంద్రబాబు.. రహస్య స్నేహం?

తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబు మాట్లాడుకున్నట్లు ఢిల్లీలో వార్తలు హల్ చల్ చేస్తోంది. నెల కిందట ఖమ్మం లో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. దీని వెనకాల ఉన్న కథ ఏమిటంటే రాబోయే రోజుల్లో దేశంలో మళ్లీ ప్రధానిగా మోఢీ బీజేపీ గనక అధికారం చేపడితే చంద్రబాబు, కేసీఆర్ లా హవా నడవదు. వీళ్లదరి హవా తెలుగు రాష్ట్రాల్లో నడవాలంటే కచ్చితంగా అధికారంలో ఉండాలి.

ఇప్పటికే ఆంధ్రలో జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జగన్ కు బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ కాస్త వెనకబడి ఉంది. ఖమ్మంలో షర్మిల వైఎస్సార్ పార్టీకి మంచి పట్టు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీలకుండా ఖమ్మంలో టీడీపీకి తెర వెనక సపోర్టు ఇచ్చినట్లయితే ఆయా ప్రాంతాల్లో బీజేపీని దెబ్బకొట్టవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది.

ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో ఆంధ్ర సెటిలర్లు ఉంటారు. వారి ఓట్లను టీడీపీకి పడేట్లు చేస్తే బీజేపీ దెబ్బతింటుంది. ఎలాగైనా ఆ ఓట్లను బీజేపీకి పడకుండా చూడాాలి.చంద్రబాబు, కేసీఆర్ నేరుగా మాట్లాడుకోకుండా పక్కన ఉండే మంత్రుల ఫోన్ల నుంచి అరగంట పాటు ఖమ్మం లో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభ సమావేశంలో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

అంటే మొత్తం మీద టీడీపీ, బీఆర్ఎస్ ల కలయిక నిజమవుతుందా.. ఈ రెండు పార్టీలు కలవడం వల్ల ఆంధ్రలో బీఆర్ఎస్ కు ఏమైనా లాభం చేకూరుతుందా..  టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం సాధించే అవకాశం వస్తుందా.. ఒక వేళ తెరవెనక నుంచి పరోక్షంగా మద్దతు ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ప్రజలు మళ్లీ టీడీపీకి తెలంగాణలో ఓటు వేస్తే బీజేపీ కి వచ్చే ఎమ్మెల్యే సీట్లకు గండిపడినట్లేనా..  తెలంగాణ, ఆంధ్ర రాజకీయాలు సాధారణ ఎన్నికల నాటికి ఎలాంటి మలుపులు తీసుకుంటాయో.. ఎవరు ఎవరితో జోడి కడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: