తెలంగాణ రైతుల మరణాల వెనుక అసలు కథ?

తెలంగాణలో రైతు బీమా వల్ల ఎంతో మంది రైతుల కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటున్నాయి. ఇదొక గొప్ప పథకమని అందరూ భావిస్తుంటే కొన్ని పత్రికల్లో రైతులు ఇంతమంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారని ఊకదంపుడుగా కథనాలు రాస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణలో రైతు బీమా అనేది రైతు ఏ విధంగా చనిపోయినా ఇస్తారు. దీనికి ప్రతి రైతు పై రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటుంది.

రైతు చనిపోయినప్పడు ఆ బీమాను వారం రోజుల్లోపు ఆ కుటుంబానికి ఇస్తూ ఉంటారు.  18 - 59 సంవత్సరాల లోపు ఉన్న రైతులు ఏ విధంగా చనిపోయినా ఇస్తారు. రైతు బీమా మొత్తం రూ.5 లక్షలు వారం రోజుల్లో బాధిత కుటుంబానికి అందజేస్తారు. అయితే  2018 ఆగస్టు 15 నుంచి దాదాపు ఒక లక్ష మంది చనిపోయారు. అందులో క్యాన్సర్ తో చనిపోయినా వారు 18 మంది.. ఎలక్ట్రిక్ షాక్ తో చనిపోయిన వారు 8 మంది, యాక్సిడెంట్ తో చనిపోయినా వారు 41 మంది, బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన వారు 4 గురు ఉన్నారు.

ఇంకా గుండె పోటుతో చనిపోయిన వారు 92, హైబీపీ 1, లంగ్స్ పెయిల్యూర్ 5, పెరాలసిస్ 1, కరోనా 88, డెంగ్యూ 1, న్యూమోనియా 1, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారు 21, లివర్ డ్యామెజ్ 4, చెట్టు నుంచి పడిపోయి చనిపోయి వారు 1, ఊపిరి పీల్చడం ఇబ్బంది కలిగి చనిపోయిన వారు 1, అనుమానాస్పదంగా చనిపోయిన వారు 1, అనాారోగ్యం 205, సహజ మరణాలు  275 వరకూ ఉన్నాయి.  ఇలా ఏ  విధంగా చనిపోయిన వారైనా తెలంగాణలో రైతు బీమా ఇస్తున్నారు. అయితే ఇలాంటి పథకాన్ని సాధారణ పౌరులకు కూడా వర్తించేలా చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: