అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

యుద్ధ ట్యాంకులు ఇవ్వండి రష్యాను అడ్డుకుని తీరుతామని ఉక్రెయిన్ అమెరికా, యూరప్ దేశాలను కోరింది. అప్పుడు  ఆయా దేశాలు వాటిని అందిస్తే రష్యా పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ తర్వాత మంచి బాంబులు ఇవ్వండి అని కోరారు. బాంబుల్ని కూడా పూర్తిగా నాశనం చేసేసింది రష్యా. ఇప్పుడు మంచి ఎయిర్ క్రాప్ట్ లు ఇవ్వండి రష్యా పని పడతామని ఉక్రెయిన్ అమెరికాను కోరుతుంది. ఎయిర్ క్రాప్ట్ లను ఇవ్వడానికి కూడా అమెరికా ముందుకొస్తుంది.

ఇప్పటివరకు ఇచ్చిన యుద్ధ ట్యాంకులు, బాంబులు, మిగతా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేయడంలో వాటిని కూల్చివేయడంలో రష్యా ఉక్రెయిన్ కంటే ఒకడుగు ముందుగానే ఉంది. ఇప్పటి వరకు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాదే పైచేయిగా ఉంది. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ కనక ఉక్రెయిన్ చేతికి  వస్తే అప్పుడేమో చెప్పలేం కానీ ప్రస్తుతం మాత్రం ఉక్రెయిన్ యుద్ధంలో వెనకబాటులోనే ఉంది.

ఈస్టన్ ఉక్రెయిన్ లో రష్యా చేస్తున్న దాడిలో రష్యా కు సంబంధించిన డజన్ కు పైగా యుద్ధ ట్యాంకులను పేల్చేసినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. ఉక్రెయిన్ సుఖోయ్ -30 యుద్ధ విమానాన్ని తాజాగా పేల్చేసినట్లు  చాలా ప్రాంతాలను తాము స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటిస్తోంది. మొత్తం మీద ఇరు దేశాలు చేస్తున్న యుద్ధం ఇప్పటితో ముగిసేలా లేదు.

ఉక్రెయిన్ కు పెద్ద ఎత్తున సాయం చేస్తున్న అమెరికా, యూరప్, బ్రిటన్ దేశాలు ఎలాగైనా రష్యాపై ఆధిపత్యం సాధించాలని ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. రష్యా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా ఏదైతేనేం యుద్ధంలో ఎలాగైనా గెలిచి తీరాలని ఉవ్విళ్లూరుతుంది. మరి రెండు దేశాల మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా.. లేక రష్యాను ఏకాకిగా చేసి అమెరికా తను అనుకుంటున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుందా వేచి చూడాలి. కచ్చితంగా రష్యాను దెబ్బతీసేలా అమెరికా మరిన్ని యుద్ధ ట్యాంకుల్ని ఉక్రెయిన్ కు ఇచ్చేందుకు వెనకాడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: