మన పక్కన ఉన్న వ్యక్తికి గుండెపోటు వస్తే ఏం చేయాలి?

గుండెపోటు.. అప్పటి వరకు నవ్వుతూ నలుగురితో కబుర్లు చెబుతున్న వారు సైతం క్షణాల్లో కుప్పకూలేలా చేస్తుంది. రెప్పపాటు కాలం గుండె పనిచేయటం ఆగితే చాలు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అయితే అలాంటి సమయంలో కాస్త చాకచక్యంగా వ్యవహరించి బాధితులకు కావాల్సిన ప్రాథమిక చికిత్స చేస్తే వారిని ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చు. గుండె పనిచేయటం ఆగిన వారికి కార్డియో పల్మనరీ రిసస్టేషన్ ...సీపీఆర్ చేయటం ద్వారా తిరిగి గుండె పనిచేసేలా చూడవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి సీపీఆర్ చేయటం తెలిసి ఉండాలంటున్నారు వైద్యులు.

గుండె ఆగినప్పుడు ఛాతి మధ్య భాగంలో రెండు చేతులను ఉంచి బలంగా ... ఇక క్రమ పద్ధతిలో ఒత్తిడి తీసుకురావటం ద్వారా తిరిగి గుండెను పనిచేసేలా చేయటాన్నే సీపీఆర్ గా చెబుతుంటాం. అయితే ఇది ఎలా చేయాలన్నదానిపై సరైన పరిజ్ఞానం లేకపోతే బాధితులకు మరింత సమస్య వచ్చే అవకాశం లేకపోలేదు. సుమారు పది వేల మందికి సీపీఆర్ లో శిక్షణ ఇచ్చేలా ఈ హ్యాండ్స్ ఓన్లీ సీపీఆర్  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జనహితా సేవా ట్రస్ట్ సభ్యులు ముందుగానే పలు విద్యా సంస్థలు , పోలీస్ స్టేషన్లకు వెళ్లి కార్యక్రమం గురించి వివరిస్తున్నారు.  కేవలం గంట సేపట్లోనే ఈ సీపీఆర్ ని నేర్చుకోవచ్చన్న అవగాహన కల్పిస్తున్నారు.

ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేరుగా గాంధీ ఆస్పత్రికి వచ్చి శిక్షణ పొందచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాచ్ ల వారిగా నిర్వాహకులు ఈ శిక్షణ ఇస్తున్నారు. డమ్మీ బొమ్మలపై సీపీఆర్ ఎలా చేయాలో అవగాహన కల్పిస్తున్నారు.  కళ్లముందే ఓ ప్రాణం పోయే పరిస్థితి ఎదురైనప్పుడు చిన్న టెక్నిక్ ద్వారా కాపాడచ్చు. అందుకే సమాజంలో ప్రతి ఒక్కరు తప్పక సీపీఆర్ ని నేర్చుకోవాలి. మానవ శరీరానికి అనునిత్యం రక్తం సరఫరా చేస్తూ... అవయవాలు సరిగా పనిచేసేలా చూస్తుంది గుండె. అందుకే హృదయానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

ఇటీవల కాలంలో గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య అతకంతకూ పెరుగుతోందని మరి ముఖ్యంగా కార్డియాక్ అరెస్టు బాధితులు ఎక్కువ అవుతున్నారు. అందుకే గుండె పనిచేయటం ఆగిన వారిని కాపాడుకునేందుకు సీపీఆర్‌ ను అంతా నేర్చుకోవాలి. అవగాహన పెంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

CPR

సంబంధిత వార్తలు: