జగన్.. ఆ జీవో పై పట్టు వీడితే మంచిది?

ఆంధ్రప్రదేశ్‌లో జీవో నెంబర్ వన్ రద్దు చేయాలని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అసలు రోడ్డు షోలే వద్దు అనుకుంటే జగన్ పాదయాత్ర, బస్సు యాత్ర, ఓదార్పు యాత్ర చేసేవాడా అని ప్రతిపక్షాలు విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నాయి. నిజమే ఏదో ఒక సంఘటన జరిగినంత మాత్రాన రోడ్ షోలను నిలిపివేయడం ఏమాత్రం సబబు కాదని వాదిస్తున్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ లో ఏమీ లేదని చెబుతుంది. అలాంటప్పుడు ఆ జీఓని ఎందుకు తీసుకురావాలి?

నిబంధనల ప్రకారం సభలకు సమావేశాలకు పోలీసులు అనుమతి తప్పనిసరి. ఏ సమావేశం జరిగినా ఏ పాదయాత్ర జరిగిన ఎక్కడ సమావేశం పెట్టాలనుకున్న ముందస్తుగా పోలీసుల పర్మిషన్ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గాని నాయకుడు గాని తీసుకుంటూనే ఉన్నారు. ప్రత్యేకంగా జీవో నెంబర్ వన్ తీసుకురావడం దేనికి? జీవో నెంబర్ వన్ ఉద్దేశం ఏంటి? రోడ్ షో నిర్వహించకూడదని అందులో లేదని వైసిపి నాయకులు చెప్తున్నారు. మరి అలాంటివి ఏమీ లేనప్పుడు ఆ జీవో ఎందుకు తీసుకురావాలి అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు? మరి ఈ జీవో  వల్ల ప్రతిపక్షాల ప్రశ్నించే తత్వాన్ని ప్రభుత్వం అణచివేయాలనుకోవడం సాధ్యమవుతుందా?

ఉదాహరణకు నరేంద్ర మోడీని చూసి జగన్ గానీ జగన్ ప్రభుత్వం గానీ నేర్చుకోవాలి. కర్ణాటకలో రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు ప్రధాని పర్యటన రోడ్ షో పూర్తిగా ఒక పక్క ప్రణాళిక ప్రకారం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ప్రధానికి  ప్రజలు కాస్త దూరంగా ఉండేలా అధికారులు చూస్తారు. అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబుకు జెడ్ కేటగిరి భద్రత ఉన్నా  ఆయన దగ్గర దాకా అభిమానులు వస్తున్నారు. దీని ద్వారా కొన్నిచోట్ల తొక్కిసలాట జరుగుతుంది. ముఖ్యంగా తొక్కిసలాట జరగకుండా రోడ్ షోలు నిర్వహించుకునేలా పార్టీలు పోలీసులకు అధికారులకు సరైన సమాచారం అందిస్తే రాష్ట్రంలో సభలు సమావేశాలపై ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరి ప్రాణాలు పోవు. అందరూ సురక్షితంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: