ఈవీఎంతోనే తలనొప్పి.. ఇక ఆర్‌వీఎం కూడానా?

ఈవీఎం.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్.. ఈ యంత్రం వాడకంపైనే దేశవ్యాప్తంగా అనుమనాలు ఉన్నాయి. హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు కూడా ఇప్పుడు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారు. మరి అలాంటి నేపథ్యంలో.. ఇక ఇప్పుడు ఈసీ కొత్తగా ఆర్‌వీఎంలను తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ యంత్రం ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా సొంత ఊళ్లో ఓటు వేసుకోవచ్చు. అయితే.. ఈ ఆర్‌వీఎంను విపక్షాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.

ఆర్‌విఎంపై ఈసీ  అఖిలపక్ష సమావేశంలో హాజరైన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్.. ఆర్‌విఎంపై ఈసీ ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వలేదని తెలిపారు. ఆర్వీఎం ఆచరణ సాధ్యం కాదని చాలా పార్టీలు చెప్పాయని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మరికొన్ని పార్టీలు వ్యతిరేకించాయని.. వలస కార్మికుల సంఖ్య ఎలా తెలుస్తుందో స్పష్టత లేదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. బాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని మాయావతి డిమాండ్ చేశారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

ఈవీఎంలపై మాయావతి లేవనెత్తిన ప్రశ్నలను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వివరించారు. అయితే.. రిమోట్ ఓటింగ్ విధానాన్ని బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తోంది. ఆ ప‌ద్ధతి మన దేశంలో అవ‌స‌రం లేదని బీఆర్ఎస్  అభిప్రాయపడుతోంది. అభివృద్ధి చెందిన దేశాలే రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప‌క్క‌న పెడుతున్నాయని.. బీఆర్ఎస్  నేత, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ అంటున్నారు. బీ.ఆర్.ఎస్. పార్టీగా మేం రిమోట్ ఓటింగ్ విధానాన్నివ్య‌తిరేకిస్తున్నామని..  ఆ ప‌ద్ధతి దేశంలో అవ‌స‌రం లేదని బోయినపల్లి వినోద్ కుమార్‌ అంటున్నారు.

ఎన్నిక‌ల్లో వాడుతున్న ఈవీఎంల‌ను హ్యాక్ చేస్తున్నార‌నే అనుమానాలు, ప్రచారాలు బ‌లంగా ఉన్నాయని.. వాటినే ఈసీ ఇప్పటి వ‌ర‌కు నివృత్తి చేయ‌లేదని... అలాంటప్పుడు మ‌ల్టీ కానిస్టిట్యూయెన్సీ రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా విశ్వసిస్తామని బోయినపల్లి వినోద్ కుమార్‌ ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్ దేశాలే ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల‌ను ప‌క్కన‌ పెట్టేశాయన్న బోయినపల్లి వినోద్ కుమార్‌... నిత్యం బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేస్తున్న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయని... అలాంట‌ప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుతో వేసే ఓట్లను ఎలా న‌మ్మగ‌లమని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

EVM

సంబంధిత వార్తలు: