ఈ కేటీఆర్‌ కోరికలు.. మోదీ తీరుస్తారా ?

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని చాలా కోరికలు కోరుతున్నారు. తెలంగాణకు ఏం ఏం కావాలో చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఇటీవల తరచూ లేఖలు రాస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు బడ్జెట్ లో నిధులిచ్చి సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరుతున్నారు. తెలంగాణ పారిశ్రామిక పురోగతికి కేంద్రం కూడా సహకరించాలని... తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరించడమంటే దేశానికి సహకరించినట్లేనని  మంత్రి కేటీఆర్  అంటున్నారు.

కేవలం ఎనిమిదేళ్ల ప్రగతి ప్రస్థానంతో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందన్న  మంత్రి కేటీఆర్ .. అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులను తెలంగాణ అభివృద్ధి చేస్తోందన్నారు. తెలంగాణ పారిశ్రామిక ప్రాజెక్టులకు జాతీయ ప్రాధాన్యత ఉందన్న  మంత్రి కేటీఆర్ .. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో చేపట్టిన కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. జహీరాబాద్ నిమ్జ్ లో మౌలికసదుపాయాల కల్పన కోసం నిధులు ఇవ్వాలని.. హైదరాబాద్ - వరంగల్ పారిశ్రామిక కారిడార్ కు అవసరమైన నిధులు కేటాయించాలని... హైదరాబాద్ - నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని  మంత్రి కేటీఆర్  కోరుతున్నారు.

హైదరాబాద్ - విజయవాడ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని.. హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని.. జడ్చర్ల పారిశ్రామిక పార్క్ లో ఉమ్మడి వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని.. బ్రౌన్‌ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ లు మంజూరు, అప్‌గ్రేడేషన్ చేయాలని..  మంత్రి కేటీఆర్  కేంద్రాన్ని కోరుతున్నారు. అలాగే.. ఆదిలాబాద్ సీసీఐ యూనిట్‌ ను పునరుద్ధరించాలని... హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని.. హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని.. కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలని  మంత్రి కేటీఆర్  విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ కోరికలు కేంద్రం తీరుస్తుందా?

మరింత సమాచారం తెలుసుకోండి:

KTR

సంబంధిత వార్తలు: