పవన్, చంద్రబాబు.. జనం చెవుల్లో పెడుతున్నారా?

రాజకీయాలనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అవి ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా మారిపోతుంటాయి. రాజకీయ బంధాల్లో.. ఈరోజు శత్రువు అనుకున్న వాళ్లు రేపు మిత్రులవుతారు, ఈరోజు మిత్రుడు అనుకున్నవారు రేపు బద్ధ శత్రువులు అవుతారు. కానీ వాళ్లు స్నేహం చేస్తున్నా లేదా వారి మధ్య శత్రుత్వం ఉన్నా, అది ఏ రాజకీయ పార్టీల మధ్యనైనా సరే వాళ్ల మధ్య జరిగేది చాలా వరకూ ప్రజలందరికీ తెలుస్తుంది. వాళ్లు కూడా తమ శత్రువులమైతే శత్రువు అని చెప్తారు మిత్రులు అయితే మిత్రుల్లానే ప్రవర్తిస్తుంటారు.

కానీ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో  జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. జనసేన ఇంకా టిడిపి పరస్పరంగా స్నేహితులమని ఎప్పుడు పైకి చెప్పుకోలేదు, అలాగని  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలాసార్లు తెలుగుదేశం పార్టీని అంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరిపాలనను విమర్శించిన వారే . అలాంటి సందర్భంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉంటుందని ఎవరు భావిస్తారు. ఒకవేళ లేదు, జరిగింది ఏదో జరిగింది ఇక నుండి అయినా స్నేహితులుగా ఉందాం అనుకుంటే అది వారు బాహాటంగా చెప్పుకోవచ్చు.

ఇప్పటంలో గోడల్ని కూలిస్తే  ఇళ్లను కూల్చేశారని, అన్యాయం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ,ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్లారట. ఎందుకు అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు ప్రసంగానికి  జరిగిన అవాంతరం గురించి అడగడానికి వెళ్లారట. ఒక రకంగా చనిపోయిన వారిని పరామర్శించారు అంటే అది  న్యాయం, కానీ కుప్పం రోడ్ షో కి వెళ్లిన వెళ్లి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని  పరామర్శించడం ఏమిటో తెలియడం లేదట చాలామందికి.

అదేదో  మేము, మా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి.. చర్చించుకోవడానికి కలిసాము అని బాహాటంగా చెప్పితే నష్టం ఏమిటి..  దానికి అధికార పక్షంలో ఉన్న పార్టీవి అన్నీ బ్రిటిష్  చట్టాలని వాళ్లని విమర్శిస్తూ,  విషయాన్ని వారి పైకి డైవర్ట్ చేస్తున్నారా అని సందేహించడానికి కాకపోతే అన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: