మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ పవన్‌ డైరెక్ట్ అటాక్‌?

శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో జనసేనాని పవన్ కల్యాణ్‌ మరోసారి గర్జించారు. ఈసారి ఆయన నేరుగా సీఎం జగన్‌నే టార్గెట్‌ చేసుకున్నారు. ఇది మూడు ముక్కల ప్రభుత్వం.. ఇతను 3 ముక్కల సీఎం అంటూ విమర్శించారు. మూడు ముక్కల ముఖ్యమంత్రీ.. మీ నాన్న వైఎస్‌నే ఎదుర్కొన్నా.. పంచెలూడదీసి కొడతానని అప్పట్లోనే సవాల్‌ చేశా అంటూ రెచ్చిపోయారు. మూడు ముక్కల ముఖ్యమంత్రీ.. నేను విడాకులు ఇచ్చాకే పెళ్లిళ్లు చేసుకున్నా.. నేను అన్నీ తెగించినవాడినిరా  బాబూ.. నువ్వు ముఖ్యమంత్రివి అయితే నేను సామాన్యుడిని అంటూ నేరుగా జగన్‌ను టార్గెట్ చేశారు.

సీఎం జగన్.. మీరు పేపర్లు చూసి చదవడం మానేయండి అని పవన్ కల్యాణ్‌ సలహా ఇచ్చారు. పులివెందుల నుంచి కిరాయి సైన్యాలనూ తెస్తే తెండి.. పిరికివాడిగా బతకడం కంటే ధైర్యవంతుడిగా చావడం నాకు ఇష్టం అంటూ పవన్ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు. గడాఫీ, సద్దాం హుస్సేన్‌ వంటి నియంతలు కూడా ప్రజలకు తలవంచారన్న  పవన్‌.. ఈ సీఎం నియంత కూడా కాదు.. సైకో అంటూ డైరెక్ట్ ఎటాక్ చేశారు. జనసేనకు అధికారం ఇస్తే ప్రస్తుతం ఉన్న పథకాలు ఏమీ తీసివేయబోమన్న  పవన్‌.. మూడు ముక్కల సీఎం కంటే మంచి పథకాలు తెస్తానన్నారు.

సీఎం జగన్‌ కు గ్యాంబ్లింగ్‌ పిచ్చి అని ఈ మధ్యే తెలిసిందన్న పవన్ కల్యాణ్‌.. సీఎంకు మూడు ముక్కల పిచ్చి ఉందన్నారు. ఖైదీ నంబర్‌ 6093 కూడా నా గురించి మాట్లాడితే ఎలా? అంటూ పవన్ కల్యాణ్‌ సెటైర్లు వేశారు. తాను ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపుతానని.. ఉత్తరాంధ్ర వలసలు ఆపుతా.. అభివృద్ధి చేస్తానని.. యువకులారా.. మీకోసం నేను తిట్లు తింటున్నానని పవన్ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు. సరైన రాజు లేకపోతే సగం రాజ్యం నాశనం అవుతుందన్న  పవన్‌.. సలహాలిచ్చేది సజ్జల అయితే రాజ్యం పూర్తిగా నాశనం అవుతుందంటూ సెటైర్‌ వేశారు. మరి ఈ డైరెక్ట్ ఎటాక్‌పై వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: