అప్పట్లో ఆయన్ను అసెంబ్లీ ఎన్టీఆర్‌ అని పిలిచేవారట?

మాజీ ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన  వెంకయ్య నాయుడు  తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన సందర్భంలో బిజెపికి ఎదురైన అనుభవాలను నెమరు వేసుకున్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు తన గురించి.. ఎవరా కుర్రాడు అని వాకబు చేసి మరీ, తనను పిలిచి మాట్లాడారని చెప్పారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం ఒక రకంగా బిజెపి అభివృద్ధికి ఆటంకం అయ్యిందని ఆయన చెప్పారు.
 
తాను అసెంబ్లీలో ఉండి అప్పటి ప్రభుత్వాన్ని చాలా కరుకుగా, పదునుగా విమర్శించే వాడినని..తన పదునైన స్పీచ్ లను బట్టి అసెంబ్లీలో అందరూ తనను "అసెంబ్లీ ఎన్టిఆర్"అని పిలిచేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పటికే అసెంబ్లీలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని చర్చ జరిగేదని, అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య.. తన స్పీచ్ లను చూసి అసెంబ్లీకి ఎన్టీఆర్ లా ఉన్నాడని వ్యాఖ్యానించారని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ ను వ్యతిరేకించే మేము కమ్యూనిస్టు పార్టీలతో.. ఇంకా అందరితో కూడా కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలు కలిపి చేసామని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పుడు సాయంత్రం అయితే వారి గురించే ఎక్కువగా న్యూస్  వచ్చేవని.. ఈనాడు పేపర్ లో అయితే ఎక్కువగా ఎన్టీఆర్ వార్తలు వచ్చేవని ఆయన చెప్పారు. కానీ మేము ఎక్కువ ఎన్ని ఉద్యమాలు చేసినా తెలుగుదేశం పార్టీ తరఫునుండి రామారావు గారి వ్యక్తిత్వం, ఆయన జనాకర్షణ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, జనాలకు బిజెపి పైన మంచి అభిప్రాయమే ఉన్నా.. మంచి పార్టీ అనే అభిప్రాయం ఉన్నా గెలిచేది మాత్రం తెలుగుదేశం పార్టీనే అని చెప్పారు.

తాము గెలవలేమని, రామారావు మాత్రమే గెలుస్తాడని, అప్పుడు ప్రజల్లో బాగా నమ్మకం ఉండేదని వెంకయ్య చెప్పారు. అప్పట్లో.. యువకులు, ముసలి వాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ రామారావు.. రామారావు అని ఆయన నామమే జపించేసరికి మిగిలిన పార్టీలన్నీ ఓడిపోయాయని దాంతో తెలుగుదేశం పార్టీ మాత్రమే  విజయం సాధించగలిగిందని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: