డిజిటల్ రంగంలో తెలంగాణ దూకుడు?

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది. కేంద్రం నుంచి ఈ రంగంలో అనేక అవార్డులు తాజాగా సాధించింది. తెలంగాణ ప్రభుత్వం అనేక రంగాలలో సరిహద్దు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు డిజిటల్ ఇండియా అవార్డుల్లో గోల్డ్ ఐకాన్ అవార్డు గెలుచుకున్న అధికారులకు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. 2022 డిజిటల్ ఇండియా అవార్డు ప్రదానోత్సవంలో డిజిటల్ ఇనిషియేటివ్స్ విభాగంలో తెలంగాణ ప్రభుత్వం గోల్డ్ ఐకాన్ అవార్డును గెలుచుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ సర్కారు చేపట్టిన స్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ ఆఫ్ సాయిల్ ప్రాజెక్టుకు ఈ అవార్డు లభించింది. ఈ వర్గం అవార్డును డిజిటల్ ఇండియా అవార్డులలో మెుదటిసారి ప్రవేశపెట్టగా అది తెలంగాణకే వచ్చింది. ఈ అవార్డును న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, రైల్వేస్ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ అవార్డును అధికారులు అందుకున్నారు.

ఈ అవార్డు అందుకున్నవారిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ ఎల్. రమాదేవి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ సీనియర్ కన్సల్టెంట్ సుధీర్ కుమార్ జిందమ్, కృషితంత్ర ముఖ్య కార్యనిర్వహణ అధికారి సందీప్ కొండాజీ ఉన్నారు. వీరంతా డిజిటల్ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కృత్రిమ మేధ, క్లౌడ్ టెక్నాలజీల స్వీకరణలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సాంకేతికతలు... మన జీవితాలను ప్రభావితం చేస్తూ పరివర్తన తీసుకురావడానికి శక్తివంతమైన సాధనంగా మారాయని కేటీఆర్ అన్నారు.  అధికారులు ఇదే కృషితో పని చేసి రాష్ట్రాన్ని డిజిటల్ రంగంలో అగ్రస్థానంలో కొనసాగేలా చేయాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: