జగన్ చర్యలతో పెరుగుతున్న చంద్రబాబు గ్రాఫ్‌?

ఇంతకుముందు ఏనాడూ ఏ మాజీ ముఖ్యమంత్రి కి జరగని అవమానకర సంఘటన చంద్రబాబు నాయుడుకి ఎదురైంది. ప్రతిపక్ష నాయకుల రోడ్ షోలు ర్యాలీలను నిషేధించిన జగన్ ప్రభుత్వం చంద్రబాబు పర్యటన అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. జగన్ లక్ష్యం ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటించకూడదు. ఆ పర్యటనని ఎలాగైనా అడ్డుకొని తీరాలి. దీంతో చంద్రబాబు బెంగుళూరుకు వచ్చి అక్కడ నుంచి తన సొంత నియోజకవర్గం వెళ్లాలనుకున్నారు. కానీ కేజిఎఫ్ పెద్దూరు అనే గ్రామం వద్ద నీలగిరిపల్లి పోలీసులు పర్యటనని అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. దీనితో ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో కి తెలుగుదేశం కార్యకర్తలు చేరుకున్నారు.

గుంటూరు సభలో 8 మంది చనిపోవడం, మరో సభలో ముగ్గురు ప్రాణాలు పోవడం వరుసగా జరిగిన సంఘటనలతో ఏపీ ప్రభుత్వం రోడ్ షోలపై నిషేధం విధించింది. ఇంత వరకు బాగానే ఉన్నా అనుకోకుండా జరిగిన ఘటనలతో  అసలు ప్రతిపక్ష పార్టీలు రోడ్ షోలే చేయొద్దంటే ఎలా.. ప్రతి చిన్న సిటీలో బహిరంగ సభలు సాధ్యమేనా.. దీనితో అందరిలో చర్చ మొదలైంది. భావ ప్రకటన స్వేచ్ఛ పై జగన్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో పోతుందని బయట జోరుగా మాట్లాడుకుంటున్నారు. పోలీసులు కూడా పూర్తి ఏకపక్షంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు అర్థమవుతుంది.  ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడంతో ప్రజల్లో ఒక రకమైన భావన కలుగుతుంది. పోలీసులు ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోతాయి. అదే స్థాయిలో చంద్రబాబు కి సానుభూతి పెరుగుతుంది.

ప్రభుత్వం ఇలా అడ్డుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలి. రూట్ మ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆయా రాజకీయ పార్టీలు చెప్పినట్టు వినకపోతే చర్యలకు ఉపక్రమించాలి. కానీ రోడ్ షోలు,ర్యాలీలు చేయరాదు అంటే ప్రజాక్షేత్రం లోకి ప్రతిపక్ష నాయకుల్ని రాకుండా  అడ్డుకోవడమే..వైసీపీ నాయకులు మాత్రం ప్రజల ప్రాణాలు తమకు ముఖ్యమైన అంశమని వారి ప్రాణాలు పోతుంటే రోడ్ షో లకు ఎలా అనుమతి ఇస్తామని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: