ఏపీ బీఆర్‌ఎస్‌లో చేరే తొలి ఎమ్మెల్యే ఆయనేనా?

ముందుగా అనుకున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో విస్తరించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాచరణ ఆరంభించారు. బీఆర్ఎస్ ఆరంభమే కాపు సామాజిక వర్గాల్ని దగ్గర తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ చింతల పార్థసారథి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, టీజీ ప్రకాష్ అనంతపురం, జాతీయ కాపు అధ్యక్షుడు తాడి వాక రమేష్ నాయుడు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒకటి స్పష్టం అవుతుంది. కాపు సామాజిక వర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే మొదటి ప్రాధాన్యంగా తీసుకున్నట్టు తెలుస్తుంది.

సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని కేసీఆర్ అన్నారు. ఏ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. వైసీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, జనసేనకు చెందిన వారా అనే చర్చ మొదలయింది. జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే అయితే వైసీపీ కి మద్దతుగా ఉంటున్నారు. టీడీపీ వాళ్లయితే గెలిచిన స్థానాలు తక్కువే.  రాయలసీమలో గెలిచినవి మూడు. అందులో చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్.. ఈ ముగ్గురు ఎలాగో బీఆర్ఎస్ లో అస్సలు చేరే అవకాశమే లేదు. కోస్తా నుంచి అంటే కూడా ఎవరు చేరకపోవచ్చు.

ఇక ఉన్నదల్లా ఉత్తరాంధ్ర వెలమ సామాజిక వర్గం. ఇక్కడినుంచి ఎవరైనా వెళ్లే అవకాశం ఉంటుందనుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా అంత ఈజీ కాదు. వైజాగ్ నుంచి గంటా పేరు వినిపించినా మొన్నే చంద్రబాబు కటౌట్లతో కొత్త సంవత్సరం వేడుకలు అంటూ అదరగొట్టాడు. మరి ఎవరు చేరతారు. అయినా సీఎం కేసీఆర్ బట్ట కాల్చి మీద వేసినట్టు ఎవరో వస్తున్నారు. పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని ఒక చర్చనైతే లేవనెత్తారు.

మరి బీఆర్ఎస్ లో ఎవరు చేరతారు. ఎవరు దూరంగా ఉంటారని త్వరలోనే తేలుతుంది. ఏ విషయం లేకుండా కేసీఆర్‌ లాంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేస్తారని అనుకోలేం.. మరి బీఆర్‌ఎస్‌లో  చేరే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరన్నది తేలాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: