న్యూ ఇయర్‌ పార్టీ చేసుకోవాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

కొత్త సంవత్సరం రాబోతోంది. అనేక మంది కొత్త ఏడాదికి ఎలా స్వాగతం పలకాలా అని అనేక ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. అయితే.. హైదరాబాద్‌ నగరంలో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజామున రెండు గంటల వరకు ఈ ఆంక్షలులో ఉంటాయని తెలిపారు.

ఎన్టీఆర్ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ రహదారుల మీదుగా ఈ సమయంలో  వాహనాలను అనుమతించబోమని పోలీసులు ప్రకటించారు. అలాగే ఖైరతాబాద్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్‌, రాజ్‌భవన్‌ రోడ్డు మీదగా  పోలీసులు మళ్లించనున్నారు. అలాగే బీఆర్‌కే భవన్‌ మీదగా ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలు తెలుగుతల్లి కూడలి మీదగా లక్డీకాపూల్‌ మీదగా పోలీసులు మళ్లిస్తారు.

లిబర్టీ కూడలి మీదగా అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదగా వెళ్లే వాహనాలను అంబేద్కర్‌ విగ్రహం వద్ద పోలీసులు మళ్లిస్తారు.. మింట్‌ కాంపౌండ్‌ రహదారిని మూసివేస్తారు. అలాగే నల్ల గుట్ట రైల్వే బ్రిడ్జి మీదగా సంజీవయ్య పార్కు వైపు వెళ్లే వాహనాలను రాణిగంజ్‌ మీదగా మళ్లిస్తారు. సికింద్రాబాద్‌ మీదగా ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ కూడలి మీదగా లోయర్‌ ట్యాంక్‌బండ్‌ కట్టమైసమ్మ ఆలయం మీదగా మళ్లిస్తారు.

ట్రావెల్స్‌ బస్సులు లారీలు, భారీ వాహనాలకు డిసెంబర్‌ 31 వ తేదీ నుంచి జనవరి 1 వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల వరకు నగరంలోకి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. అలాగే  
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై పోలీసులు డిసెంబరు 31న రాత్రి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించబోతున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలతో పాటు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారి పై చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ప్రతి ఒక్కరు పోలీసులు సూచించిన నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: