ఆ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోతోందా?

న్యూస్ పేపర్ లేదా న్యూస్ ఛానల్, అసలు.. వార్తలని తెలిపేది ఏదైనా.. నిజాన్ని చూపించే దానిలా ఉండాలి గాని.. ఏదైనా ఒక పార్టీని, పార్టీ ఎజెండాని మోసే భుజంలా ఉండకూడదు. కానీ ప్రస్తుతం కొన్ని ప్రధాన పత్రికలు ఇలాగే ఉన్నాయి. సాక్షిని చూసినప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పరిస్థితులు కనిపిస్తే.. ఎల్లో మీడియాగా పేరున్న పత్రికలు చూస్తే.. మరోలా కనిపిస్తాయి మనకి, పరస్పర విరుద్ధంగా. రెండూ నిజం కాదు.. ఇక్కడ అభివృద్ధి ఉంది.. కష్టం కూడా ఉంది. కానీ ఎవరి వార్తలు వాళ్ళవి. ఎవరి ధోరణి వాళ్ళది.

ఒక పక్కన చంద్రబాబు మాటల్లాగానే ఎల్లో మీడియాగా పేరున్న పత్రికలు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావట్లేదు అంటూ ఉంటే.. ఆ మాట అబద్ధం అంటూ సాక్షి లెక్కలతో సహా వివరిస్తుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లో -జనవరి నుంచి సెప్టెంబర్ వరకు  44,206 కోట్లు, తెలంగాణకి 2,990 కోట్లు,ఒరిస్సా కి 37,070 కోట్లు, మహారాష్ట్ర కి 26,600 కోట్లు, గుజరాత్ కి 25,813 కోట్లు, రాజస్థాన్ కి 16,179 కోట్లు, కర్ణాటక 6,601 కోటి, తమిళనాడు కి 5,419 కోట్లు, పెట్టుబడులు వచ్చాయి అని సాక్షి లెక్కలతో సహా వివరిస్తోంది.

ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ గణాంకాలని సాక్షి వివరిస్తోంది. 2020 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు 6476 కోట్ల విలువైన పెట్టుబడులు తో 129యూనిట్ల ఉత్పత్తిప్రారంభమయ్యిందని.."డి.పీ.ఐ.టీ"అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ గణాంకాలు వివరిస్తున్నాయి‌ . కొత్తగా మరో 13,516 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు వివరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు వేగంగా జారీ చేయడం ద్వారా మరో 20 భారీ  ప్రాజెక్టులకు శంఖు స్థాపన జరగబోతుందని, దానికి అనుగుణంగా నిర్మాణ పనులు వేగంగా జరిగి.. ఏది ఏమైనా ఆయా పరిశ్రమల నుంచి ఉత్పత్తిని సాధించే క్రమంలో అడుగులు వేగంగా పడుతున్నాయని సాక్షి వివరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP

సంబంధిత వార్తలు: