ఏపీలో కాపులకు ఇందుకే అధికారం దక్కడం లేదా?

కాపులు.. ఏపీలో సంఖ్యాపరంగా చాలా ఎక్కువ జనాభా ఉన్న కులం. బీసీల్లోనే ఉన్నా.. కాస్త పలుకుబడి, సత్తా ఉన్న కులం. కానీ.. ఈ కులానికి మాత్రం ఇప్పటి వరకూ రాజ్యాధికారం దక్కలేదు. గతంలో చిరంజీవి, ప్రస్తుతం పవన్ కల్యాణ్‌ రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు. అయితే.. ఇదే సామాజిక వర్గానికి చెందిన తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు కాపులకు రాజ్యాధికారం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం వల్ల బీసీలకు కాపులు దూరమవుతున్నారని రామ్మోహన్‌రావు అంటున్నారు.

ఏపీ రాష్ట్రంలో 30శాతం మంది కాపులు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారని రామ్మోహన్ రావు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల వల్ల కాపులకు ఉపయోగం లేదన్న రామ్మోహన్ రావు వారి రిజర్వేషన్ల కోసం పోరాటం చేయొద్ధని తాను చెప్పానని తెలిపారు. కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడొద్దని ముద్రగడకు తాను చెప్పానని రామ్మోహన్ రావు అన్నారు. బీసీ రిజర్వేషన్లనేది కాపుల సంక్షేమానికి కంటితుడుపు చర్యే తప్ప సామాజికంగా ఎటువంటి ప్రయోజనం లేదని రామ్మోహన్ రావు తెలిపారు. రాజకీయాల వల్ల కాపు అనే కులం డైవర్ట్ అయిందంటున్నారు రామ్మోహన్ రావు.

కాపు రిజర్వేషన్ ఉద్యమం వల్ల బీసీలకు కాపులు దూరమవుతున్నారని రామ్మోహన్ రావు అన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకు బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదని రామ్మోహన్‌రావు తెలిపారు. తుని సభతో కాపులను అల్లరి మూకలుగా ముద్ర వేశారని రామ్మోహన్ రావు అన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఏపి నుంచి ముగ్గురు సుప్రీం కోర్టు జడ్జిలయ్యారు కదా.. వారికేం రిజర్వేషన్లున్నాయని రామ్మోహన్ రావు ప్రశ్నించారు.

కాపులు సంఘాలుగా విడిపోవడం వల్ల సంఘటితం కాలేక పోతున్నామని రామ్మోహన్ రావు తెలిపారు. పౌరుషం, పంతాలకు పోవడం వల్ల కాపులు ఎదగలేకపోతున్నారని... ఓర్పు, నేర్పుతో ఉండటం వల్లే మిగతా కులాలు అన్ని రంగాల్లో  స్థిరపడ్డాయని రామ్మోహన్ రావు అన్నారు. కాపులకు రాజ్యాధికారం లేదు అని ఎక్కడా చెప్పొద్దని రామ్మోహన్ రావు సూచించారు. 35 మంది వరకు కాపులు ఎమ్మెల్యేలుగా ఉన్నారని.. కాపు సంఘాలు రాజకీయాలు వదిలేసి అభివృద్ది కోసం పని చేయాలని రామ్మోహన్ రావు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: