ఏపీకి రాష్ట్రపతి ముర్ము తెచ్చిన వరాలు ఇవే?

ఏపీలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ముర్ము అనేక కీలక ప్రాజెక్టులకు విశాఖలో శంకుస్థాపనలు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ, రహదారులు భవనాలు మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులను రాష్ట్రపతి ముర్ము బటన్ నొక్కి ప్రారంభించారు. కర్నూలు 3వేల ఎకరాల్లో ఏర్పాటుచేసిన డిఆర్డిఓ నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. రూ. 932 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి కర్నూలు -డోన్ ల మధ్య 6 లైన్ జాతీయ రహదారి, రాయచోటి- బెంగళూరు మధ్య ఆరు లైన్లో జాతీయ రహదారి, చంద్రగిరి- తిరుపతి మధ్య నాలుగు లైన్ల రహదారి,పుట్టపర్తికి ప్రత్యేక రహదారిని రాష్ట్ర పతి ప్రారంభించారు.

కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ సంబంధించి, 2024 నాటికి  740 ఏకలవ్య పాఠశాలను ఏర్పాటుకు రాష్ట్రపతి ముర్ము శ్రీకారం చుట్టారు. బుట్టాయిగూడెం, రాజవొమ్మంగి ,గుమ్మలక్ష్మీపురంలో ఏకలవ్య పాఠశాలలను ద్రౌపది ముర్ము ప్రారంభించారు.  మూడు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా ఆయా రంగాల్లో అదనపు సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్రపతి ముర్ము చెప్పారు.

జాతీయ రహదారుల విస్తరణ దేశానికి మరింత ప్రగతి సూచికగా ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత స్థానాలను అందుకునేందుకు ఏకలవ్య పాఠశాలలు ఎంతగానో ఉపకరిస్తాయని రాష్ట్రపతి ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వందేళ్ళ స్వతంత్ర భారతావని అభివృద్ధి కి రానున్న కాలంలో ఇవి తోడ్పడుతాయని నమ్మకం ఉందని  రాష్ట్రపతి ముర్ము చెప్పారు.

భారతదేశానికి పూర్వవైభవ సాధనలో ఇవన్నీ ఎంతో ఉపకరిస్తాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. నౌకాదళ ధైర్యసాహసాలను రాష్ట్రపతి ముర్ము ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతకుముందు.. విశాఖలో  కన్నుల పండువగా నౌకాదళ దినోత్సవం జరిగింది. ముఖ్య అతిధిగా రాష్ట్రపతి ద్రౌపది మర్ము హాజరయ్యారు. నావికుల విన్యాసాలు తిలకించారు. ప్రముఖ సంగీత దర్శకులు శంకర్ మహదేవన్ నేవీ స్ఫూర్తి పెంపొందించే గీతాన్ని ఆలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: