భలే ఛాన్స్.. డ్రోన్ ట్రైనింగ్ నేర్చుకుంటారా?

ఇప్పుడు దేశంలో ఏ రంగం చూసినా డ్రోన్ల వినియోగం ఎక్కువైంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. అందుకే దేశంలోనే తొలిసారిగా గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వ్యవసాయ డ్రోన్ల పైలెట్ శిక్షణ ఇస్తోంది. ఇందు కోసం యూనివర్శిటిని డిజిసిఏ అధికారులు సందర్శించి అనుమతించారు. దీంతో గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం  ఈ అరుదైన అవకాశం దక్కింది.

వ్యవసాయ రంగంలో డ్రోన్ల పైలెట్ శిక్షణ ఇచ్చేందుకు యూనివర్శిటికి డిజిసిఏ అధికారులు అనుమతించారు. డిజిసిఏ డైకర్టర్ జితేందర్ లౌర తాజాగా యూనివర్శిటిని సందర్శించి ఇక్కడి డ్రోన్లు, ఇతర మౌళిక వసతులను పరిశీలించారు. వ్యవసాయ డ్రోన్ల నిర్వహణపై 12రోజుల కోర్సును యూనివర్శిటీ రూపొందించింది. ఇందులో శిక్షణ ఇచ్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పరిశోధన కేంద్రానికి అనుమతించారు. దీంతో డ్రోన్ పైలెట్ శిక్షణ కోసం ఇలాంటి కోర్సుకు దేశంలోనే మొదటిసారిగా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుమతి సాధించన ఘనత దక్కింది.

ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అప్సర కార్యక్రమం కింద గత మూడేళ్లుగా డ్రోన్ ద్వారా పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యవసాయంలో డ్రోన్ల సేవలు మరింత విస్తరించేందుకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు శిక్షణా కేంద్రానికి అనుమతి రావటంపై యూనివర్శిటి వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ కోర్సుకు అనుమతి ఇచ్చిన డిజిసిఏ అధికారులకు చీఫ్ పైలట్ ట్రైనర్ డాక్టర్ ఏ సాంబయ్య, యూనివర్శిటి రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎల్. ప్రశాంతి కృతజ్ఞతలు తెలిపారు.

అయితే.. డిజిసిఏ నుంచి పూర్తిస్థాయి అనుమతులు రావటానికి మరో రెండు నెలలు సమయం పడుతుంది.  ఆ తర్వాతే డ్రోన్ పైలెట్ శిక్షణను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో  ప్రారంభించనున్నారు. అంతే కాదు..  శిక్షణ పొందిన వారికి యూనివర్శిటి తరపున సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు.. ఈ డ్రోన్‌ ట్రైనింగ్‌ తీసుకుని ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: