ఆ విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ టాప్?

ఆంధ్ర ప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతోంది.. ఏపీని ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ అంధకారమయం అవుతోంది. ఇవీ తరచూ తెలుగు దేశం అనుకూల మీడియాలో కనిపించే వార్తలు.. కానీ.. అబ్బే అదేమీ లేదంటున్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ ప్రజల్ని తప్పు దోవ పట్టించేలా బులెటిన్ ఇవ్వటం శోచనీయమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శిస్తున్నారు.
 
ఆర్ధిక అంశాల్లో అనుభవజ్ఞుడైన యమనల ప్రజలకు తప్పుడు సమాచారం ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ ఆర్ధిక క్రమశిక్షణ బాగుందని కాగ్ చెప్పిందన్నారు. అంతే కాదు.. దేశంలోనే ఆర్ధిక నిర్వహణ చేస్తున్న రాష్ట్రాల్లో  ఏపీ అగ్రభాగాన ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటున్నారు. అందుకు ఉదాహరణగా ఆయన కొన్ని లెక్కలు కూడా చెప్పారు. ప్రస్తుత ఏడాదికి ఏపీలో 2.10 శాతం మాత్రమే ద్రవ్యలోటు ఉందని.. ఏపీ ప్రతిష్టను దిగజార్చేలా, బ్యాంకులు రుణాలు ఇవ్వకూడదనే టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.

గత ప్రభుత్వ హయాంలో 19.50 శాతం మేర అప్పులు పెరిగితే వైసీపీ ప్రభుత్వ హయాంలో 15.5 శాతం మాత్రమే అప్పులు పెరిగాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లెక్కలు చెబుతున్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 27.5 వేల కోట్ల పనులు చేస్తే మూడేళ్లలోనే మా ప్రభుత్వం ఆ పనులు చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ప్రతీ దానికీ ఏపీని శ్రీలంకతో పోలుస్తున్నారని.. డీబీటీ కింద 1.40 లక్షల కోట్లు పేదలకు చేర్చామని... నాన్ డీబీటీ ద్వారా 44 వేల కోట్లు లబ్దిదారులకు చేరిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.

నెట్ బారోయింగ్ సీలింగ్ విషయంలో రుణ పరిమితిని పెంచుకోడానికే కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఎగుమతులు, పరిశ్రమలు, పథకాలు, పన్నుల వసూళ్లలో గతంతో పోలిస్తే ఏపీ అత్యున్నత స్థానంలో ఉందని అన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చే విషయంలో ఆలస్యమైన మాట వాస్తవమేనని అంగీకరించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. జీతాల విషయంలో జాప్యం జరగలేదని... జీతాలను ప్రాసెస్ చేసే విషయంలో గతంలో 10 రోజుల సమయం తీసుకుంటే ఇప్పుడు మూడు రోజుల్లోనే అవుతోందని అన్నారు. అవుట్ సోర్సింగ్  ఉద్యోగుల విషయంలో సాంకేతిక ఇబ్బందుల వల్లే ఆలస్యం అవుతున్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: